Rashmi Gautam Screen Age.. స్క్రీన్ ఏజ్ అంటే ఏంటబ్బా.?
స్క్రీన్ ఏజ్ చూసి, ‘ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా.? చెయ్యదా.?’ అన్న చర్చ మొదలవుతుందంటూ రష్మి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఓ డబ్బింగ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా రష్మి (Rashmi Gautam) కీలక వ్యాఖ్యలు చేసింది తన స్క్రీన్ ఏజ్ విషయమై.
ఇంతకీ, స్క్రీన్ ఏజ్ అంటే ఏంటో తెలుసా.? స్క్రీన్ మీద కనిపించి.. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్న సమయం అట.!
గుంటూరు టాకీస్ తర్వాత.. పెద్ద గ్యాప్..
అప్పుడెప్పుడో ‘గుంటూరు టాకీస్’ సినిమాలో నటించింది రష్మి గౌతమ్. ఆ తర్వాత పెద్ద బ్రేక్ వచ్చేసింది. ఈ విషయాన్నే రష్మి చెప్పుకొచ్చింది.
చిరంజీవితో ‘భోళా శంకర్’లో చిన్న పాత్రలో కనిపించడంపై స్పందిస్తూ, ‘చిరంజీవి సినిమాలో ఛాన్స్ అంటే.. ఏ చిన్న పాత్ర అయినా.. ఎవరూ చెయ్యననే పరిస్థితే వుండదు..’ అని చెప్పిందామె.

‘నటిగా ఎప్పుడూ బిజీగా వుండాలనే అనుకుంటాను. అందుకే, ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తున్నాను..’ అని నిర్మొహమాటంగా తన మనసులో మాటల్ని బయటపెట్టేసింది రష్మి.
కొన్నాళ్ళ క్రితం, రష్మి (Rashmi Gautam) అంటే తెలుగు తెరపై హాట్ టాపిక్.! బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్తో దాదాపుగా రష్మి తెరమరుగైపోయింది.
Also Read: కృతి సనన్ ఫ్లాప్ షో.! చెల్లెలు ‘నుపుర్’ ఏం చేస్తుందో.!
ఓ వైపు బుల్లితెరపై వివిధ షోస్ చేస్తూ, అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తున్న రష్మి, సోషల్ మీడియా వేదికగా, పలు అంశాలపై స్పందిస్తుంటుంది.
మరీ ముఖ్యంగా, జంతువులపై హింసని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తుంటుంది. స్ట్రీట్ డాగ్స్కి ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలూ చేస్తుంటుంది రష్మి.
