Rashmi Gautam.. సుడిగాలి సుదీర్, రష్మీ గౌతమ్‌ల మధ్య ఏదో వుందంటూ ‘జబర్దస్త్’ స్కిట్స్ చాలా చాలా ఊహాగానాలకు ఆస్కారమిచ్చాయి. ఇద్దరి మధ్యా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత బాగా వర్కవుట్ అవడంతో, ఎప్పటికప్పుడు సరికొత్త ఊహాగానాలు వచ్చేలా కంటెంట్ తయారు చేస్తూ వచ్చింది సదరు కామెడీ షో టీమ్.
ఇటు రష్మి, అటు సుధీర్.. ఇద్దరూ ఆయా స్కిట్స్‌కి అదనపు గ్లామర్ అద్దేందుకు తమవంతుగా కష్టపడ్డారు. బుల్లితెరపై పలు ఈవెంట్లలో వీరిద్దరి పెళ్ళి (డ్రామా) కూడా ‘నిజ్జంగా నిజం’ అనిపించేలా జరిగింది. ఎన్నిసార్లు ఈ ఇద్దరి మీదా లవ్ ట్రాక్ నడిపినా, అది సక్సెస్ అవుతూనే వచ్చింది.
Rashmi Gautam పెళ్ళయిపోయిందా.? నిజమెంత.?
అసలు విషయమేంటంటే, రష్మి గౌతమ్ సైలెంటుగా పెళ్ళి చేసేసుకుందట. ఆమె భర్త ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడట. కెరీర్ పరంగా ఇబ్బందులు రాకుండా పెళ్ళి విషయాన్ని దాచేసిందట. అలాగని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కామెడీ కాకపోతే, పెళ్ళి జరిగి వుంటే దాన్ని దాచాల్సిన అవసరం రష్మికి ఏముంటుందబ్బా.? అనసూయకి పెళ్ళయ్యింది, ఇద్దరు పిల్లలున్నారు కూడా. ఆ విషయాన్ని బాహాటంగానే అనసూయ చెబుతుంటుంది. బుల్లితెర ఈవెంట్లకు తన భర్తని, పిల్లల్ని కూడా తీసుకొస్తుంటుంది అప్పుడప్పుడూ.
డేరింగ్ అండ్ డైనమిక్ రష్మి.!
సో, రష్మి గౌతమ్ నిజంగా పెళ్ళి చేసుకుని వుంటే, దాచే ప్రసక్తే లేదు. ఎందుకంటే, ఆమె డేరింగ్ అండ్ డాషింగ్. కానీ, ‘రష్మి పెళ్ళయిపోయిందట, పాపం సుధీర్ పరిస్థితి ఏంటి.?’ అంటూ చాలామంది అమాయకంగా వాపోతున్నారు. ఇంతకన్నా కామెడీ ఇంకేమన్నా వుందా.?
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
అన్నట్టు, ఈ పెళ్ళి పరచారంపై రష్మి గౌతమ్ (Rashmi) ఏమంటుందో.!