Rashmika Mandanna Animal Trolling.. అయ్యోపాపం రష్మిక.! ఔను, ‘నేషనల్ క్రష్’ రష్మిక మండన్న మాత్రం ఏం చేయగలుగుతుంది.?
‘యానిమల్’ సినిమాలో రష్మిక మండన్నకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన పాత్ర అలాంటిది.!
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.!
Rashmika Mandanna Animal Trolling.. ఏం.. రష్మిక బాగా చెయ్యలేదా.?
సినిమాలో రష్మిక నవ్వుతూ కనిపించిన సీన్ ఒకే ఒక్కటి.. అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ, ఆమెని ట్రోల్ చేస్తున్నారు.!
‘రష్మిక తప్ప..’ అంటూ ‘యానిమల్’ సినిమాని కొందరు పొగుడుతున్నారు. రష్మిక ఇరిటేట్ అవుతూ చేసిన కొన్ని సీన్స్ గురించి ప్రస్తావిస్తూ ఆమెని ట్రోల్ చేస్తున్న వైనం అత్యంత జుగుప్సాకరం.!
తప్పదు, కొన్ని సినిమాల విషయంలో నటీనటులకి ఈ తరహా ట్రోలింగ్ తప్పదు.! ‘డియర్ కామ్రేడ్’ సినిమా విషయంలోనూ రష్మిక చాలా విమర్శలే ఎదుర్కొంది.
నేషనల్ క్రష్..
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రష్మిక నేషనల్ క్రష్.! సినిమా కోసం తనవంతు కష్టపడుతుంటుంది. ప్రమోషన్లలో చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తుంటుంది.
‘కాస్తంత యాక్టింగ్ కూడా నేర్చకుంటే బావుంటుంది’ అన్న విమర్శలు రష్మిక మీద గతంలోనూ వచ్చాయ్. అవి అలా వస్తూనే వుంటాయ్.!
అయినా, సినిమాని ఇంత వైల్డ్‌గా, ఇంత జుగుప్సాకరంగా తీసిన సందీప్ రెడ్డి వంగా మీద ‘జాలి’ చూపిస్తూ, రష్మికని ఎందుకు ట్రోల్ చేస్తున్నారబ్బా.?