Table of Contents
అతి తక్కువ సమయంలో.. అనూహ్యంగా అత్యద్భుతమైన పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక మండన్న (Rashmika Mandanna Dance Number Song Videos) పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఏదో ఆషామాషీగా ఆమెకు ఇంత పాపులారిటీ వచ్చేయలేదు. ఈ పాపులారిటీ కోసం రష్మిక మండన్న పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
కన్నడ సినీ పరిశ్రమ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి, తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుని, తర్వాత తమిళ సినిమాల్లోనూ అడుగు పెట్టి, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలూ చేసేస్తోన్న రష్మిక మండన్న, గ్లామర్..నటన.. దాంతోపాటే డాన్సింగ్ టాలెంట్.. ఇలా భిన్న కోణాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.
రష్మిక చేసిన సినిమాల్లో ఆమె డాన్సుల గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవకాశం వచ్చినప్పుడల్లా డాన్సుల్లో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూనే వుంది. వీటిల్లో ప్రస్తుతానికి సూపర్ హిట్ సాంగ్స్ అనదగ్గవేవో చూసేద్దామా మరి..
సరిలేరు నీకెవ్వరు.. డాన్సుల్లో చితక్కొట్టేసిందంతే..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో రష్మికకి మంచి డాన్స్ నెంబర్స్ పడ్డాయి. వాటిల్లో ఒకటి హీ ఈజ్ సో క్యూట్.. అయితే, ఇంకోటి.. మైండ్ బ్లాంక్. రెండూ దేనికవే.. అన్నట్టు అదరగొట్టేశాయి. రష్మిక (Rashmika Mandanna Dance Number Songs) చాలా ‘ఈజ్’ ప్రదర్శించింది డాన్సుల్లో.
భీష్మ.. నిజంగానే పెద్ద షాకిచ్చింది..
నితిన్ హీరోగా తెరకెక్కిన ‘భీష్మ’లో అయితే రష్మిక డాన్సులు ఇంకో లెవల్.. అన్నట్టే వుంటాయి. మరీ ముఖ్యంగా, ‘వాటే బ్యూటీ..’ అంటూ సాగే సాంగ్.. అలాగే, ’సూపర్ క్యూట్’ సాంగ్స్ రష్మికకి డాన్స్ కోణంలో మంచి పేరు తెచ్చిపెట్టాయి. వీటిల్లో, ‘వాటే బ్యూటీ’ పాట కోసం రష్మిక వేసిన మాస్ స్టెప్పులు కెవ్వు కేక అంతే.
గీత గోవిందం.. డియర్ కామ్రేడ్.. ఇవి కూడా..
‘గీత గోవిందం’ సినిమాలోనూ డాన్సులు అదరగొట్టేసింది రష్మిక. క్లాస్ స్టెప్పులు.. మాస్ స్టెప్పులు.. ఇరగదీసేసింది. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక డాన్సులు ఓ ఎత్తు అయితే, ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం రష్మిక వేసిన డాన్సులు (Rashmika Mandanna Dance Number Song Videos) ఇంకో ఎత్తు..
ముందు ముందు రష్మిక నుంచి మరిన్ని సాంగ్స్ చూడబోతున్నాం. హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూనే ఓ ప్రైవేట్ సాంగ్ ద్వారా రష్మిక ఆల్రెడీ సందడి షురూ చేసేసింది. అదే టాప్ టక్కర్ సాంగ్. రష్మిక అంటేనే డాన్స్.. అనేంతలా రష్మిక తనలోని డాన్సింగ్ టాలెంట్.. ఇదిగో ఇలా బయటపెట్టేస్తోందన్నమాట.