Rashmika Mandanna Genius.. హన్నన్నా.! ఎంత మాట అనేసింది ‘వారసుడు’ సినిమా గురించి.
తమిళంలో ‘వారిసు’ ఘనవిజయం సాధించగా, తెలుగునాట ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల నడుమ నలిగిపోయింది తెలుగు వెర్షన్ ‘వారసుడు’.!
‘వారిసు’ సినిమా ప్రారంభం సమయంలోనే, తమిళ హీరో విజయ్ అంటే తనకెంత అభిమానమో చెప్పుకుని, రష్మిక చేసిన ఓవారక్షన్ అంతా ఇంతా కాదు.
తీరా, సినిమా విడుదలయ్యాక.. రెండు పాటలకే రష్మిక పరిమితమైందనే విమర్శలు రావడంతో, ఫాఫం రష్మిక డీలా పడిపోయింది. ‘వారసుడు’ టీవీ సీరియల్ కంటే దారుణమన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే.
Rashmika Mandanna Genius దటీజ్ రష్మిక..
రష్మిక మమా ముదురు.! ఆ విషయం ఇప్పుడు ఇంకోసారి నిరూపితమయ్యిందంతే.! ‘వారసుడు’ సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని ఒప్పేసుకుంది రష్మిక.

‘ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ, విజయ్ సర్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో ఇంకేమీ ఆలోచించలేదు..’ అని రష్మిక తాజాగా చెప్పుకొచ్చింది.
‘పాటల్లో దుమ్మురేపెయ్యాలనుకున్నాను.. అదే చేశాను. ఈ విషయాన్ని సెట్స్‌లోనూ విజయ్ సర్‌తో చాలా సార్లు చెప్పాను..’ అంటోంది రష్మిక.
దర్శకుడు వంశీ ఏమంటాడో మరి.!
దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఇప్పుడేమంటారన్నది ఆసక్తికరంగా మారింది.!
సినిమాలో హీరోయిన్‌కి వెయిట్ లేని క్యారెక్టర్ దర్శకుడు డిజైన్ చేయడమేంటి.? అన్న ప్రశ్న రష్మిక అభిమానుల నుంచి వస్తోంది మరి.!
Also Read: డిజాస్టర్ ‘వాల్తేరు వీరయ్య’: 200 కోట్ల క్లబ్బులోకి.!
ఇప్పుడు ఒప్పుకుంటారా రష్మిక మహా ముదురు అని.! అన్నట్టు, హిందీలో రష్మిక సినిమాలు రెండూ ఫట్ అయిపోయాయి. దానికి కారణమేంటో.! అవి ఫ్లాపవుతాయని కూడా రష్మికకి ముందే తెలుసంటారా.?