Rashmika Mandanna Girl Friend.. రష్మిక మండన్న గర్ల్ ఫ్రెండ్‌గా వస్తానంటే ఎవరు మాత్రం కాదనగలరు.?
నేషనల్ క్రష్ రష్మిక మండన్న (Rashmika Mandanna) కోసం కుర్రకారు క్యూ కట్టేస్తారు.! ఆ క్యూ లైన్ చాంతాడంత వుంటుంది.!
ఆగండాగండీ, అసలు విషయం వేరే వుంది. ఇది రష్మిక మండన్న కొత్త సినిమా గురించి. సినిమా టైటిల్ ‘గర్ల్ ఫ్రెండ్’.!
దర్శకుడిగా మారిన హీరో..
రాహుల్ రవీంద్రన్ తెలుసు కదా.? అదేనండీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అందాల రాక్షసి’ సినిమా (అదే ఆమెకు తొలి సినిమా) ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్.

‘చిలసౌ’ అనే సినిమాకీ రాహుల్ (Rahul Ravindran) దర్శకత్వం వహించాడు. మరికొన్ని సినిమాలూ ఆయన దర్శకత్వంలో తెరకెక్కాయ్.
ఆ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ‘గర్ల్ ఫ్రెండ్’ (Girl Friend Movie) సినిమా తెరకెక్కనుంది.
విషయమేంటబ్బా.?
కాస్త నవ్వుతూ కనిపించింది రష్మిక.. అదీ నీళ్ళలో.! ఆ వెంటనే ఎక్స్‌ప్రెషన్ మారిపోయింది.! తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఓ వ్యక్తి చెబుతున్న మాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్నాయ్.
Also Read: ఫ్యామిలీ స్టార్.! విజయ్ దేవరకొండ ఈసారేం చేస్తాడో.!
క్రియేటివిటీ అదిరింది.! సినిమా ఎలా వుంటుందో.! అది తెలియాలంటే, ముందుగా సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి.. అది పూర్తవ్వాలి.. థియేటర్లోలకి రావాలి.!