‘కాంతారా’ సినిమా వివాదం నేపథ్యంలో రష్మిక మండన్న (Rashmika Mandanna) మీద కన్నడ సినీ పరిశ్రమ గుస్సా అయ్యిందట. ఆమెపై బ్యాన్ కూడా విధించేసిందట.!
నిజానికి ‘కాంతారా’ ఒక్కటే కాదు. ఆమె తొలి సినిమా గురించి ప్రస్తావన వస్తే, బ్యానర్ పేరు చెప్పడానికి నిరాకరించి వివాదాల్లోకెక్కింది రష్మిక.
ఎట్టకేలకు ఈ వివాదాలపై రష్మిక తనదైన స్టయిల్లో స్పందించింది. తొలి సినిమా బ్యానర్ పేరు చెప్పకపోవడానికి గల కారణాన్ని అయితే ఆమె వివరించలేదు.
Rashmika Mandanna.. బ్యాన్ చేయలేదట..
కానీ, కన్నడ సినీ పరిశ్రమ తనపై బ్యాన్ విధించడం గురించి స్పందించింది రష్మిక.. అదీ తనదైన స్టయిల్లో. ‘నన్నెవరూ బ్యాన్ చేయలేదు..’ అని రష్మిక ఓ ప్రశ్నకు బదులిచ్చింది.
ఇక, ‘కాంతారా’ వివాదం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా విడుదలైన రెండు మూడు రోజులకే సినిమా గురించి తనను అడిగారనీ, సినిమా చూడలేదు గనుక ఆ విషయాన్నే చెప్పానని అంటోంది రష్మిక.

కొన్ని రోజుల తర్వాత సినిమా చూశాననీ, సినిమా బావుందని ఆ సినిమా కోసం పనిచేసినవారికి మెసేజ్ పెట్టాననీ, అట్నుంచి థ్యాంక్యూ అనే రిప్లయ్ కూడా వచ్చిందని రష్మిక పేర్కొంది.
వివాదం చల్లారినట్లేనా.?
సో, ఇక్కడితో ఈ వివాదం చల్లారినట్టేనన్నమాట. ఇంతకీ, రష్మికపై కన్నడ సినీ పరిశ్రమలో విధించబడిన బ్యాన్ ఎత్తివేయబడినట్లేనా.?
అధికారికంగా బ్యాన్ విధించలేదుగానీ, బ్యాన్ విధించాలన్న డిమాండ్లు అయితే వచ్చాయ్. అలా డిమాండ్ చేసినవారంతా ఇప్పుడేమంటారో.!
Also Read: Kalpika Ganesh.. నీదీ.. నాదీ.. ఒకటే బాధ.!
రష్మిక మండన్న నటిగా కెరీర్ ప్రారంభించింది కన్నడ సినీ పరిశ్రమ నుంచే. అయితే, ఇప్పుడామె ఏ కన్నడ సినిమాలోనూ నటించడంలేదు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో మాత్రమే రష్మిక మండన్న ప్రస్తుతం సినిమాలు చేస్తోంది.
హిందీలో రష్మిక నటించిన ‘గుడ్ బై’ ఇటీవలే విడుదలైంది.. అది ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తమిళంలో రష్మిక నటిస్తున్న ‘వారిసు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగులో రష్మిక తదుపరి సినిమా ‘పుష్ప ది రూల్’.