Home » అభద్రతాభావంపై రష్మికాస్త్రం.. అసలేమైంది చెప్మా.?

అభద్రతాభావంపై రష్మికాస్త్రం.. అసలేమైంది చెప్మా.?

by hellomudra
0 comments
Rashmika Mandanna

రష్మిక మండన్న (Rashmika Mandanna) తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న నటి మాత్రమే కాదు, తక్కువ కాలంలోనే నటనా కెరీర్ పరంగా, జీవితం పరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, రష్మిక.. జీవితాన్ని చదివేసిందనడం సబబేమో.

తాజాగా రష్మిక మండన్న సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేస్తూ, ఓ పెద్ద కథ రాసింది. అది జీవిత సత్యాలతో కూడిన పోస్ట్. మనుషులుగా మనం కొన్ని లోపాలతో పుడతాం.. అభద్రతా భావంతో వుంటాం.. కానీ, ప్రపంచం చెబుతున్నదానికంటే మనం బలవంతులమని గుర్తించినప్పుడు.. మరింత బలవంతులమవుతాం.. మరింత తెలివైనవాళ్ళం అవుతాం.. అని రష్మిక చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna వేదాంతం వెనుక అసలు కారణమేంటి.?

Rashmika Mandanna
Rashmika Mandanna

మన గురించి మనం తెలుసుకున్న రోజున మనల్ని ఆపే శక్తి ఇంకెవరికీ వుండదన్నది రష్మిక ఉవాచ. ఇతరులు మీ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే, ఆ అవకాశం వారికి మనం ఇస్తున్నట్టే లెక్క అని రష్మిక చెబుతోంది. మనకి ప్రేమ కావాలి.. అని కూడా రష్మిక చెబుతోంది. అదే సమయంలో నీ జీవితానికి నువ్వే యజమానివని అంటోంది ఈ బ్యూటీ.

ఎవరైతే అర్హత కలిగి వుంటారో వారితో మాత్రమే మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల్ని పంచుకోండని సలహా ఇచ్చింది రష్మిక మండన్న.

“Being human – we are born with flaws and grow up with insecurities..But there comes a moment when you realise that you are much bigger than what the world is telling you- you can be..You are stronger, you are wiser, you are smarter.. When you realise this, you become unstoppable.”

“The thing is, you allow other people to have power over you.. But your power can be yours and only yours, if you choose it to be.”

Also Read: లింగ సమానత్వమట.. నవ్విపోదురుగాక.!

“You can live an extremely relaxed, happy life without any attachment.. But we need love, we need attention, we need attachments.”

“We are only human and emotions are everything for us..”

“What I am trying to say is- you are the owner of your life- of your heart and your emotions..”

“Share them with only those who are worth it & choose wisely.”

ఓ ఫొటో పెట్టి, దాంతోపాటుగా ఇంత కథ.. (జీవిత సత్యమేననుకోండి..) చెప్పిందంటే, రష్మిక ఇటీవలి కాలంలో ఎవరి విషయంలో అయినా, షాక్‌లు తినేసిందా.? లేదంటే, ఎవరికైనా బాగా దగ్గరయ్యిందా.? ఏమోగానీ, రష్మిక చెప్పిన మాటల్లో వాస్తవం వుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలన్నది రష్మిక చెబుతోన్నమాట.

Also Read: ఓ రష్మిక.. ఓ త్రిష.. ఓ మెహ్రీన్.. అంతే కదా.! తప్పేముంది.?

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group