Rashmika Mandanna Properties.. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ.. ఇలా వివిధ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా రష్మిక మండన్న పేరు మార్మోగిపోతోంది.
కన్నడలో సినిమాలైతే ప్రస్తుతం ఏమీ చేయడంలేదు రష్మిక. అది వేరే కథ.
ఇక, రష్మిక తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. పూజా హెగ్దేకీ రష్మికకీ టాప్ ఛెయిర్ విషయంలో పోటీ నడుస్తోంది తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి.
భలే తెలివైంది సుమీ..
రష్మిక సినిమాల్లో గట్టిగానే సంపాదిస్తోంది.. దానికి తోడు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా రష్మికకి ఆదాయం దండిగానే వస్తోంది.
సంపాదించిన సొమ్ముని జాగ్రత్త చేసుకునే తెలివితేటలూ బాగానే వున్నాయ్ రష్మికకి. సొమ్ముని వృధా చేయడం అస్సలు ఇష్టం వుండదట రష్మికకి.

కాకపోతే, కార్లంటే మహా మోజు. అందుకే, లగ్జరియస్ కార్లు అప్పుడప్పుడూ కొనుగోలు చేస్తుంటుంది.
Rashmika Mandanna Properties .. సొంతిల్లు సంగతేంటి.?
ఐదేళ్ళలోనే రష్మిక.. దేశంలోని ఐదు పెద్ద నగరాల్లో ఏకంగా ఐదు లగ్జరియస్ అపార్టుమెంట్లు కొనేసిందట. అలాగని ఓ ప్రచారం గట్టిగా జరుగుతోంది.
Also Read: Nikki Tamboli.. పెళ్ళి కళ వచ్చేసిందే బాలా.!
కానీ, రష్మిక మంత్రి ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. ‘ఎవరు ఇలాంటివి ప్రచారం చేస్తారో నాకు తెలియదు. కానీ, ఆ ప్రచారంలో నిజం లేదు. నిజమవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను..’ అంటూ రష్మిక స్పందించింది.
ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు రష్మిక పై విధంగా సమాధానమిచ్చింది.