బెంగుళూర్ బ్యూటీ రష్మిక మండన్నా (Rashmika Mandanna) తెలుగులో అగ్ర హీరోయిన్. చాలా తక్కువ సినిమాలతో చాలా ఎక్కువ పేరు ప్రఖ్యాతలొచ్చేశాయ్ రష్మికకు. అసలు రష్మికలో అంత స్పెషల్ క్వాలిటీ ఏముందనీ.? ఇలా చాలా మందికి చాలా అనుమానాలుండడం సహజమే.
‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్ల కోసం రష్మిక పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ప్రమోషన్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. దర్శకుడు ఎలా చెబితే, అలా చేయడానికి అస్సలు వెనుకాడదు రష్మిక. డాన్సుల్లో రష్మిక డెడికేషన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఇప్పుడిదంతా ఎందుకంటే.? ఓ నెటిజన్ రష్మికను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్న సంధించాడు. ఎలా తీసుకుంటున్నార్రా దీన్ని.? అని క్వశ్చన్ చేశాడు. దానికి రష్మిక సింపుల్‌గా సమాధానమిచ్చింది. ‘నా యాక్టింగ్ కోసం..’ అంటూ రెండు ఎమోజీలను పోస్ట్ చేసింది.
నిజానికి రష్మిక ఇంకొంచెం ఘాటుగానే సమాధానమివ్వగలదు. కానీ, ఎందుకో చాలా సంయమనం పాటించింది. రష్మిక అభిమానులు మాత్రం ఆ నెటిజన్‌ని ఏకి పారేస్తున్నారు. ఆ నెటిజన్ మహేష్ బాబుకి వీరాభిమాని. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ..’ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
Also Read: కొత్త పైత్యం.. స్కూళ్ళలో శృంగార విద్యాభ్యాసం.?
నిజానికి హీరోయిన్లే కాదు, హీరోలూ ఈ చెత్త ట్రోలింగ్‌కి బాధితులే. సెటైర్లేయడం, ఫన్నీగా క్వశ్చన్ చేయడం వరకూ ఓకే కానీ, స్టార్లుగా ఎదిగిన వ్యక్తుల్నీ, వారి వ్యక్తిత్వాల్నీ, శక్తి సామర్ధ్యాల్నీ సిల్లీగా క్వశ్చన్ చేయడం ఒకింత జుగుప్సాకరంగానే ఉంటాయి.
అన్నట్టు రష్మిక (Rashmika Mandanna) ఇలా ట్రోలింగ్ మీద సెటైర్లేయడం కొత్తేమీ కాదు. సెటైర్లు వేస్తూనే వుంటుంది.. చిత్రమేంటంటే, ఆమెకు బోల్డంత మద్దతు కూడా లభిస్తుంటుంది. ఎందుకంటే, ఆమె ఎప్పుడూ హద్దులు దాటదు. అదే ఆమె ప్రత్యేకత. అందుకే, చాలా తక్కువ సమయంలోనే బోల్డంతమంది అభిమానుల్ని ఆమె సంపాదించుకుంది.