Table of Contents
Ravanasura Review మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది.! ఓటీటీలోకి చాలా సైలెంటుగా వచ్చేసింది.!
థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసే అవకాశం వచ్చినా, ఎందుకో కుదరలేదు.! దాంతో, ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశా.! పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఓటీటీలోకి వచ్చేయడంతో, కాస్త తీరిక చూసుకుని ‘రావణాసుర’ సినిమాని తిలకించా.!
ఇంతకీ, ‘రావణాసుర’ సినిమాలో ఏముంది.? చాలా సినిమాల్లో వున్నదే వుంది.! ఇందులో నిజానికి కొత్తదనం ఏమీ లేదు. ఇదొక రివెంజ్ స్టోరీ.!
హీరోనా.? విలనా.?
హీరో రవితేజ కాస్తా విలన్‌గా కనిపిస్తాడు. షరామామూలుగానే వెకిలి కామెడీ చేశాడు.! అదేంటో, హీరో చెలరేగిపోతోంటే, ఏసీపీ స్థాయి అధికారి.. అన్నీ తెలిసీ, ఏమీ చేయలేకపోతాడు.
రవితేజ ఈసారి కొత్తగా ట్రై చేసినట్లున్నాడు.. అని ‘రావణాసుర’ గురించి ముందు అంతా అనుకున్నారు.!
ఏముంది కొత్తదనం.? నెగెటివ్ యాంగిల్‌లో కనిపించి.. చివరికి ‘హీరోయిజమే’ అది అని.. అని నమ్మించడమా.?
రవితేజ ఎనర్జీ ఆన్ స్క్రీన్ అదిరిపోతుంది. అదిప్పుడు ‘అతి’గా మారిపోతోంది.!
కేపబులిటీ వున్న మాస్ మహరాజ్ రవితేజ, ఇలాంటి సినిమాల్ని ఎంచుకుని తప్పు మీద తప్పు చేస్తున్నాడన్నది నిర్వివాదాంశం.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగకపోతే.. ముందు ముందు కష్టకాలమే.!
రొటీన్ రొట్టకొట్టుడు మాస్ సినిమాలకే పరిమితమైపోయి, ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడూ, అదే రొట్ట కొట్టుడు అందులో నింపేస్తే ప్రయోజనమేంటి.?
Mudra369
కథానాయకుడు కదా.. తెలివైనోడని చెప్పేయదలచుకుంటే, కాన్‌ఫ్లిక్ట్ ఎందుకు.? పోటా పోటీగా వ్యవహారం నడుస్తోంటే, చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటుంది.
దక్ష నగార్కర్ (Daksha Nagarkar), ఆకాష్ మేఘ (Megha Akash) పాత్రలతో రవితేజ చేసిన అతి.. అత్యంత అసహ్యంగా వుంది. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ని (Anu Emmanuel) కూడా ఆ అసహ్యానికే వాడేశారు.
Ravanasura Review.. మనుషులు.. ఇలాక్కూడా మారిపోవచ్చా.?
వాట్ నాట్.. అసలు సినిమాలో మంచి పాయింట్ అనేదే ఏదీ లేకుండా పోయింది. మాస్కులేసుకుని.. వేరే వ్యక్తుల్లా మారిపోవడమేంటో.! ఏ సమాజంలో వున్నాం మనం.?

పిచ్చికీ ఓ హద్దు వుండాలి కదా.! ప్చ్.. ఈ ‘రావణాసుర’ విషయంలో.. అసలంటూ హద్దులే లేవ్.! చివర్లో భుజానికి కొమ్ములుండే ఓ కవచం.. దాంతో, రవితేజ ఫైట్. అదింకా దారుణం.!
‘ధమాకా’ సినిమా శ్రీలీల మీదనే ఆడేసింది.! ‘వాల్తేరు వీరయ్య’కి మెగాస్టార్ చిరంజీవే హీరో.! ఎలా చూసినా, రవితేజకి సీన్ లేదని అనేయగలమా.?
కొంప ముంచుతున్న అతి విశ్వాసం.!
రవితేజకి స్టార్‌డమ్ వుంది.. కానీ, చేజేతులా చెడగొట్టుకుంటున్నాడు. ఎందుకిలా.? ఆత్మవిశ్వాసం స్థానంలో అతి విశ్వాసం పెరిగిపోవడం వల్లేనేమో.!
‘ధమాకా’లో శవాగారం సీన్ ఒకటుంటుంది.. అత్యంత ఛండాలమనుకుంటే.. దాన్ని మించిన ఛండాలం.. ‘రావణాసుర’లో చాలా సార్లు చూడాల్సి వచ్చింది.
Also Read: అఖిల్ ‘ఏజెంట్’ని ‘తొక్కే’స్తున్న ‘నందమూరి’! కారణమిదే!
మారాలి.. రవితేజ చాలా చాలా మారాలి. పొటెన్షియాలిటీ వున్న హీరో.! బోల్డంత స్టార్‌డమ్ వున్న హీరో.! భిన్నమైన పాత్రలు ట్రై చేసి, సత్తా చాటగల హీరో.!
అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్న చందాన రవితేజ (Mass Maharaja Raviteja) తయారవకూడదు.!