Ravi Aarti Keneesha Francis.. జయం రవి తెలుసు కదా.? తమిళంలో ఓ మోస్తరు స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ‘జయం’ రవి, తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తే.!
వైవాహిక జీవితంలో ఇబ్బందుల నేపథ్యంలో జయం రవి గత కొన్నాళ్ళుగా వార్తల్లోకెక్కుతున్నాడు. విడాకుల కోసం రవి ఆల్రెడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మరోపక్క, రవి జీవితంలోకి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ రావడంతోనే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని రవి భార్య ఆర్తి అంటోంది.
విడాకులు ఇంకా మంజూరు కాలేదు గనుక, రవి భార్యగానే ఆర్తి గురించి ప్రస్తావించాలి. మరోపక్క, ఆర్తిని తన మాజీ భార్యగా పేర్కొంటున్నాడు రవి.
Ravi Aarti Keneesha Francis.. కెనీషా ఫ్రాన్సిస్ మోజులో రవి మోహన్..
కెనీషా ఫ్రాన్సిస్ మోజులో పడి, తమ పిల్లలకు సైతం రవి అన్యాయం చేస్తున్నాడంటూ ఆర్తి వాపోతోంది. గత కొంతకాలంగా ఈ పంచాయితీ నడుస్తోంది.
ఇటీవల ఓ కార్యక్రమంలో కెనీషాతో కలిసి రవి సందడి చేయడంతో, రవి సతీమణి ఆర్తి గుస్సా అయ్యారు. సుదీర్ఘమైన నోట్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారామె.
రవి తగ్గుతాడా.? అంతకన్నా పెద్ద లెటర్ విడుదల చేశాడు సోషల్ మీడియా వేదికగా. కట్టుబట్టలతో తాను బయటకు వచ్చినప్పుడు, కెనీషా ఫ్రాన్సిస్ తనను ఆదుకుందని, ఓదార్చిందని చెప్పాడు రవి.
మరీ, కట్టుబట్టలతో రవి, రోడ్డున పడే పరిస్థితి ఎందుకొచ్చిందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు రవి, ఒక్కో సినిమాకీ.
Also Read: HIT-3 Review: నాని చెప్పింది సగమే నిజం.!
కేవలం రవి దగ్గర వున్న డబ్బు కోసమే సింగర్ కెనీషా ఫ్రాన్సిస్, అతన్ని వలలో వేసుకుందన్నది ఓ వాదన. సంపాదన కోణంలో చూస్తే, కెనీషా కంటే చాలా ఎత్తులో వుంటాడు రవి.
సరే రవి – ఆర్తి మధ్యన గొడవలు వుండి వుండొచ్చు. భార్య ఆర్తి నుంచి దూరమవ్వాలని రవి అనుకోవచ్చు. తనకు రవి కావాలని ఆర్తి అనుకోవచ్చు.. అది వేరే చర్చ.
భార్య ఆర్తితో తనకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి, కెనీషా మీద రవి మనసు పారేసుకోవచ్చు.. ఈ క్రమంలో భార్యతో విడాకులకు రవి ప్రయత్నించొచ్చు.
చట్ట ప్రకారం విడాకుల కోసం రవి ప్రయత్నిస్తే, అందులో తప్పేమీ లేదు. కానీ, ఇటు రవి అటు ఆర్తి.. ఇద్దరూ సోషల్ మీడియాకెక్కి రచ్చ చేసుకోవడమేంటి.?
పైగా, ‘కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడ్డప్పుడు’ అంటూ రవి చెబుతున్న మాటలు హాస్యాస్పదమవుతున్నాయి.. ఈ వ్యవహారంలో ఆర్తికి ఎడ్జ్ లజభిస్తోంది.