Ravi Teja Bhagyashri Chemistry.. వయసుకీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఏమైనా సంబంధం వుందా.? కొన్ని సార్లు వుంటుంది.. కొన్ని సార్లు వుండదు.!
ఆ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందంగా వుంటే, తెరపై కనిపిస్తున్న హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడా అనేది చూసే ప్రేక్షకులకు కనిపించదు.
సినిమా అంటేనే, ఓ అందమైన కళ.!ద అందులో గ్లామర్ లేకపోతే ఎలా.? అలాగని, కమర్షియల్ హంగుల పేరుతో, వరస్ట్ కెమిస్ట్రీని హీరో హీరోయిన్ల మధ్య చూపించడమూ సబబు కాదు.!
Ravi Teja Bhagyashri Chemistry.. రవితేజకే ఎందుకిలా.?
మాస్ మహరాజ్ రవితేజ, ఈ మధ్య హీరోయిన్ల విషయమై చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తెరపై హీరోయిన్లతో రవితేజ కెమిస్ట్రీ అస్సలు బాగోడంలేదు.

చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకి లేని సమస్య, సీనియర్ హీరో రవితేజకే ఎందుకు ఎదురవుతోంది.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తోంది.
ఎందుకు లేదు.. చిరంజీవి, బాలకృష్ణ కూడా ట్రోల్ అవుతున్నారు. కానీ, మరీ ఇంతలా కాదు. రవితేజ విషయంలో హద్దులు దాటిన ట్రోలింగ్ జరుగుతోంది.
దర్శకులకు చేత కావడంలేదా.? రవితేజ తనను తాను మార్చుకోవాల్సి వుందా.? అన్న విషయమై ‘కలిసి కూర్చుని’ చర్చించుకుంటే, సమస్యకు పరిష్కారం దొరకొచ్చు.
ఆ స్టెప్పులేంటి మహా ప్రభో.!
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తెరకెక్కింది. దాన్నుంచి ఓ పాట ఇటీవల బయటకు వచ్చింది. అదే ఇంత రచ్చకీ కారణం.
హీరో వయసేమో 56 ఏళ్ళు.. హీరోయిన్ వయసేమో జస్ట్ 25 మాత్రమే.! ఇద్దరి మధ్యా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏంటి ఛండాలం కాకపోతే.. అన్న చర్చ ఎందుకు జరుగుతోంది.?
Mudra369
మెలోడియస్ సాంగ్ వినడానికి బాగానే వుంది. కొంతవరకు చూడ్డానికి కూడా బాగానే వుంది. కానీ, హీరోయిన్ పిరుదుల మీద హీరో చేతులు వేయడం.. అసభ్యకరంగా వుందన్నది నిర్వివాదాంశం.
అసలు రవితేజ, ఈ స్టెప్పుల్ని ఎలా అంగీకరించాడు.? అంతకన్నా ముందు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇలాంటి దిక్కుమాలిన స్టెప్పుల్ని ఎలా కంపోజ్ చేశాడు.

దర్శకుడు హరీష్ శంకర్ అయినా చూసుకోవాలి కదా.! హీరోయిన్ పిరుదుల మీద చేతులేయడానికి, అస్సలు బాగోకపోయినా.. హీరోయిన్ డ్రెస్సుకి బ్యాక్ పాకెట్స్ పెట్టారు. ఇది మరీ దారుణం.!
Also Read: Andrea Jeremiah.. ప్రేమ నీడలట.! అనగానేమి.?
వున్నపళంగా రవితేజ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి వయసుతో సంబంధం లేదుగానీ, అది ఎబ్బెట్టుగా మారుతున్న దరిమిలా, దాన్ని అందంగా ప్రెజెంట్ చేయడమెలా.? అన్న విషయమై ‘వర్కవుట్’ చేయాల్సిందే.