Raviteja ART Multiplex సినీ నటుడు రవితేజ ఓ మల్టీప్లెక్స్ ఛెయిన్‌లో భాగస్వామి అయ్యాడట. ఇప్పటికే మహేష్‌బాబు పేరుతో ఓ మల్టీప్లెక్స్ వుంది.
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ కూడా కొన్నాళ్ళ క్రితమే ప్రారంభమయ్యింది. విజయ్ దేవరకొండ కూడా ఇదే వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.
మరికొందరు సినీ ప్రముఖులూ మల్టీప్లెక్సుల్లో భాగస్వాములయ్యేందుకు వ్యాపార వ్యూహాలు రచిస్తున్నారు.
అసలంటూ సినిమాల్ని థియేటర్లలో చూసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడంలేదాయె.! మరి, సినీ ప్రముఖులు ఈ మల్టీప్లెక్సు వ్యాపారంలో భాగస్వాములవుతుండడమేంటి.?
ఆ సంగతి పక్కన పెడితే, రవితేజ మల్టీప్లెక్స్ వార్త ఎలా బయటకు పొక్కిందబ్బా.?
Raviteja ART Multiplex.. ఎవడు? అది ఎవడి ఘనకార్యం.?
గత కొంతకాలంగా ఈ విషయమై సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేమంత పెద్ద వార్త కాదని చాలామంది లైట్ తీసుకున్నారు.
నాక్కూడా ఈ విషయమై గతంలోనే సమాచారం అందింది. నేనూ లైట్ తీసుకున్నాను. ఇది కూడా వార్తేనా.? అని అనుకున్నాను.

చివరికి రవితేజ మల్టీప్లెక్స్ అనేది ఓ వార్తగా మారింది. సరే, వార్త రావడంలో తప్పేముంది.? ఎవరో ట్వీటేశారు.. ఎవరో వార్తగా దాన్ని ప్రచారంలోకి తెచ్చారు.
రవితేజ అభిమానులు, ‘మా అన్న మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు’ అంటూ పండగ చేసుకుంటున్నారు.
గిదేం లొల్లి?
ఇంతలోనే లొల్లి షురూ అయ్యింది. ‘సోర్స్’ ఎవరు.? అన్నదాని గురించి వెబ్ మీడియాలో కొట్టుకు ఛస్తున్నారు కొందరు.
‘ఇదీ సోర్స్’ అంటూ ఒకాయన తన ఘనతని చాటుకునే ప్రయత్నం చేశాడు. అందరికీ తెలిసిన వార్తే కదా.? అని ఆయన మీద మిగతా మీడియా జనాలు గుస్సా అవుతున్నారు.
హీరోల పెళ్ళిళ్ళు, నిర్మాతల ఇళ్ళలోని శుభకార్యాలు, బాధాకరమైన సంఘటనలు.. వాట్ నాట్.. సోషల్ మీడియా పుణ్యమా అని అన్నీ బ్రేకింగు న్యూసులే.
Also Read: Faria Abdullah: ఆ ఒక్కటీ అడక్కూడదంటే ఎలా.?
ఇలాంటి వాటి చుట్టూ ఈ ‘సోర్స్’ల గోలేంటో.! ‘సోర్స్’ ఫలానా కాబట్టి, ఆ సోర్సుకి ఏమైనా చెల్లింపులు చేయాలా.? రాయల్టీ కోరుకుంటున్నాడా ఈ ‘సోర్సు’గాడు.? అనే ప్రశ్న తెరపైకొస్తోంది.
పిచ్చి ముదిరి పాకాన పడటం అంటే ఇదే మరి.!