Raviteja Mass Jathara Routine.. రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘మాస్ జాతర’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా ప్రమోషన్లు రొటీన్‌కి భిన్నంగా జరుగుతున్నాయా.?
అసలు, మాస్ కమర్షియల్ సినిమాకి ‘రొటీన్‌కి భిన్నంగా పబ్లిసిటీ’ ఎందుకు.? రొట్టకొట్టుడు సినిమాలకి కొత్తదనంతో కూడిన ప్రమోషన్స్ అవసరమా.?
ఇలా, సినిమా గురించీ.. సినిమా ప్రమోషన్ల గురించీ.. చర్చ జరగడం సహజమే.!
Raviteja Mass Jathara Routine.. కొత్తగా ఏముంటుంది.?
‘మాస్ జాతర’ ప్రమోషన్లలో భాగంగా హీరో రవితేజ, నిర్మాత నాగ వంశీ.. ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.
నిజానికి, అంతలా ఇంటర్వ్యూ వైరల్ అవడానికి బలమైన కారణాలేమీ లేవు. కాకపోతే, ‘అతనొక్కడే’, ‘ఓజీ’ సినిమాల ప్రస్తావన తీసుకొచ్చాడు నిర్మాత నాగవంశీ.
‘వార్-2’ ప్రస్తావన కూడా వచ్చింది. ఈ సందర్భంగా రవితేజ – నాగ వంశీ.. చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయి, ట్రోలింగుకి గురయ్యాయి కూడా.
అయితే, ‘అతనొక్కడే’, ‘ఓజీ’ సినిమాల్లో తల నరుకుడు సీన్ల గురించి నాగ వంశీ చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం.
సంక్రాంతికి వస్తే, మాస్ సినిమా బీభత్సమా.. వేరే సందర్భాల్లో వస్తే.. రొటీన్ వ్యవహారమా.? అని నాగవంశీ ప్రశ్నించాడు. నాగవంశీని ఈ విషయంలో సమర్థించాడు రవితేజ.
ఇవన్నీ, ‘మాస్ జాతర’ పరమ రొటీన్ మాస్ రొట్ట కొట్టుడు.. అనే సంకేతాన్ని సగటు సినీ అభిమాని మెదళ్ళలోకి పంపేశాయి.
Also Read: తెలియాల్సిన పనేం లేదు కదా.!
రొటీన్ సినిమా అయినా, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ సరిగ్గా సెట్టయితే, ‘మాస్ జాతర’ హిట్టయిపోవడం ఖాయం. ఎందుకంటే, ‘కొత్తదనం’ అనేది ఆశించి ఎవరూ ఈ సినిమాకి రారు కాబట్టి.
రివ్యూల్లోనూ, ‘పరమ రొటీన్’ అనే ప్రస్తావనకు ఆస్కారమే వుండదు. భలే డిజైన్ చేశారు కదా ‘మాస్ జాతర’ ప్రమోషన్లని.!
ఈ రొటీన్ ప్రమోషన్లతో, అప్పటిదాకా సినిమా పాటలపై క్రియేట్ అయిన నెగెటివిటీ మాయమైపోయింది.
