Raviteja Ravanasura.. సీతను ఎత్తుకెళ్ళాలంటే సముద్రం దాటొస్తే సరిపోదట.! రావణాసురుడ్ని దాటి వెళ్ళాలట. అలాగని అంటున్నాడు మాస్ మహరాజ్ రవితేజ.
ఇది ‘రావణాసుర’ టీజర్‌లోని డైలాగ్.! సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’.
ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా ఇతర ప్రధాన తారాగణం. తాజాగా, ‘రావణాసుర’ టీమ్, టీజర్‌ని విడుదల చేసింది.
Raviteja Ravanasura కొత్తదనం.. ఆ ఒక్కటే..
ఇటీవలి కాలంలో థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇది కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్‌లానే అనిపిస్తోంది. రవితేజని రావణాసురుడిలా ఎందుకు చూపిస్తున్నట్లు.? అన్నది తెరపైనే చూడాలి.
టీజర్ మొత్తం సీరియస్ మోడ్‌లోనే వదిలారు. రవితేజని నెగెటివ్ షేడ్‌లో చూపించడం తప్ప, మిగతాదంతా.. గత సినిమాల్లో రవితేజ పాత్రలకి ఇచ్చిన ఎలివేషన్ల తరహాలోనే వుంది.
Also Read: ‘గ్రంధాలయం’ ప్రివ్యూ: చదివితే చచ్చిపోతారా? అసలు కథేంటి!
ఏప్రిల్ 7న ‘రావణాసుర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో మంచి ఊపు మీదున్న రవితేజ, ఈసారి సీరియస్‌గా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టేస్తాడేమో చూడాలిక.!