Table of Contents
Raviteja Wrong Direction.. మిగతా హీరోలు వేరు.. రవితేజ వేరు.! రవితేజ అంటే మినిమమ్ గ్యారంటీ హీరో కాదు, స్టార్ హీరో.!
‘ధమాకా’ లాంటి చెత్త సినిమాతో వసూళ్ళ పంట పండించిన స్టామినా మాస్ మహరాజ్ రవితేజది. రాత్రికి రాత్రి వచ్చేసిన స్టార్‌డమ్ కాదిది.
సినిమాల్లో చాలా చాలా కష్టపడి, కింద నుంచి చాలా చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు రవితేజ. చాలా అరుదుగా ఇలాంటోళ్ళకి స్టార్‌డమ్ వస్తుంటుంది.
Raviteja Wrong Direction.. రవితేజ ఆల్ ఇన్ వన్..
రవితేజకు సంబంధించి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా అవగాహన వున్నోడు.
దర్శకత్వం, నిర్మాణం, కథ, మాటలు.. వాట్ నాట్.. అన్నిటి మీదా సంపూర్ణ అవగాహన వుంది రవితేజకి. అన్నిటిలోనూ వర్క్ చేశాడు కాబట్టే, రవితేజ అంత స్పెషల్.

మరి, ఇన్ని ప్రత్యేకతలున్న రవితేజ, ‘రొట్ట’ సినిమాలే ఎందుకు చేస్తున్నట్లు.? ‘రావణాసుర’ లాంటి ప్రయోగాత్మక సినిమాల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.
కానీ, అవి కూడా నవ్వుల పాలైపోయాయంటే, ఎక్కడో తేడా కొడుతోంది. స్క్రీన్ మీద రవితేజ ఏమైనా చేయగలడు. దర్శకులతో రవితేజ ఏమైనా చేయించుకోగలడు.
చేయట్లేదు.. చేయించుకోవట్లేదు..
కానీ, రవితేజ ఏమీ చేయడంలేదు.. ఏమీ చేయించుకోవడంలేదు. తాజాగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాని తీసుకుంటే, డాన్సులేశాడు.. చాలా చాలా చేశాడు.. కానీ, ఏం లాభం.? వృధా ప్రయాసే.

56 ఏళ్ళ రవితేజ 24 ఏళ్ళ భాగ్యశ్రీ బోర్సేతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంత ఎక్కువగా చేయాల్సిన అవసరమేమొచ్చింది.? ఇలాంటి ప్రశ్న రవితేజ ప్రతి సినిమాకీ వినిపిస్తోంది ఈ మధ్యకాలంలో.
మరి, తగ్గించుకోవాలి కదా అది.? ప్చ్.. తగ్గించుకోవట్లేదు.! ఎబ్బెట్టుగా కాదు, అసహ్యంగా మారిపోతోంది అది.!
తెలిసి తప్పు చేస్తున్నాడా.?
కథ, కథనాల్లో పస లేకపోతే, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఆ సినిమా వృధా.. అన్న విషయం రవితేజకి తెలియదా.? సినిమాని జడ్జ్ చేయగలిగే కెపాసిటీ వుండీ, చెత్త సినిమాలెందుకు రవితేజ చేస్తున్నట్లు.?

ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన.. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, రవితేజ వున్నపళంగా ‘పోస్టుమార్టమ్’ చేసుకోవాలి, తాను ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల గురించి.
Also Read: తల్లి చిన్మయి, తండ్రి రాహుల్.! ఓ చిన్నారి.. వ్యధ.!
తెలుసు కదా.. రవితేజకి ఏదీ అంత తేలిగ్గా వచ్చేయలేదు. స్వశక్తితో ఎదిగాడు. చాలా చాలా కష్టపడ్డాడు. ఎదిగాడు. ఎదిగాక, ఈ నిర్లక్ష్యమేంటి.?