Rebel Star Krishnamraju.. ఔను, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు.! ఇక లేరు.. అన్నది భౌతికంగా మాత్రమే.!
తెలుగు సినిమా వున్నంతకాలం రెబల్ స్టార్ కృష్ణంరాజు సగటు సినీ అభిమానిలో జీవించే వుంటారు. ఎందుకంటే, ఆయన వెండితెరపై పోషించిన పాత్రలు అలాంటివి.
‘భక్త కన్నప్ప’ సినిమా సమీప భవిష్యత్తులో ఎవరైనా చేయగలరా.? కానీ, ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటూనే వుంటారు. దటీజ్ కృష్ణంరాజు.
నటుడిగా, నిర్మాతగానే కాదు.. రాజకీయాల్లోనూ కృష్ణంరాజు తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని సంతకం చేసేసి వెళ్ళిపోయారు.!
Rebel Star Krishnamraju.. ‘భక్తకన్నప్ప’ బాధ్యత ప్రభాస్‌దే.!
ప్రభాస్ రూపంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు వెండితెరపై కనిపిస్తూనే వుంటారన్నది అభిమానులు మాట. కేవలం కృష్ణంరాజు అభిమానులు మాత్రమే కాదు, సగటు సినీ అభిమాని సైతం ఇదే అంటున్నాడు.

వృద్ధాప్య సమస్యలతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలూ ఆయన్ని బాధించాయి. చివరి రోజుల్లో చాలా చాలా శారీరక బాధల్ని అనుభవించారాయన.
అయినాగానీ, ‘భక్త కన్నప్ప’ సినిమాని మళ్ళీ తీస్తాననేవారు. ఇంకా ఏవేవో కోరికలు సినిమా పరంగా వుండిపోయాయి కృష్ణంరాజుకి. వాటిల్లో కొన్నయినా నెరవేరేలా కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్ బాధ్యత తీసుకుంటాడేమో.!
Also Read: ఇవే.! ఇద్దరూ తగ్గించుకుంటే మంచిది.!
తెలుగు సినీ వినీలాకాశంలో కృష్ణంరాజు ఓ ధృవతార.! ఆయనెప్పుడూ ఆ పై నుంచి తెలుగు సినిమా గమనాన్ని చూస్తూనే వుంటారు.!