Table of Contents
Regina Cassandra OCD.. అరరె.! రెజినాకి ఏమయ్యింది.? ఇంత అసహనమెందుకు వ్యక్తం చేసింది.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.!
నిజానికి, రెజినా కస్సాండ్ర తప్పేమీ లేదు.! ఆమె తప్పుగా ఏమీ అసహనం వ్యక్తం చేయలేదు. కానీ, అవసరమా ఇదంతా.? అన్న చర్చ అయితే జరుగుతోంది.
విషయమేంటంటే, తన తాజా సినిమా ‘శాకిని డాకిని’ ప్రమోషన్ల కోసం హైద్రాబాద్ వచ్చింది రెజినా, సహ నటి నివేదా థామస్‌తో కలిసి. ఇద్దరు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు.
ఓసీడీ సమస్య రెజినాకి వుందా.? లేదా.?
సినిమాలో రెజినా, ఓసీడీతో బాధపడే యువతి పాత్రలో నటిస్తోందిట. అప్పుడెప్పుడో శర్వానంద్ కూడా ఇలాంటి ఓసీడీ సమస్యతోనే బాధపడుతున్న యువకుడిగా ‘మహానుభావుడు’ అనే సినిమాలో నటించాడు.

అలా ఓసీడీ అంటే పెద్ద కామెడీ అయిపోయింది. సో, ఆ కామెడీ కోణంలోనే, ‘మీక్కూడా ఓసీడీ వుందా.?’ అంటూ ఓ జర్నలిస్టు వెటకారపు ప్రశ్న సంధించాడు.
దాంతో, ఒళ్ళు మండింది రెజినాకి. ‘సినిమాల్లో పాత్రలు వేరు.. నిజ జీవితంలో మనుషులుగా మేం వేరు..’ అంటూ గుస్సా అయ్యింది. ‘ఇంతకు మించి మీ దగ్గర ప్రశ్నలు లేవా.?’ అని కూడా ప్రశ్నించింది రెజినా.
అసలీ ప్రశ్నలేసేవాళ్ళకి ఏమయ్యింది.?
సెలబ్రిటీలు సినిమా ప్రమోషన్ల కోసం తమ ముందుకు వస్తే, ఏం అడగాలో తెలియడంలేదు ఈ తరం సినీ జర్నలిస్టులకి. అదే అసలు సమస్య.
సినిమా కథా కమామిషు ఏంటి.? అందులో పాత్రల స్వభావమేంటి.? ఇలాంటి ప్రశ్నలు కదా అడగాల్సింది.? ప్చ్.. అంత స్కోప్ సినీ జనాలు కూడా వాళ్ళకి ఇవ్వడంలేదనుకోండి.. అది వేరే సంగతి.
Regina Cassandra OCD రెజినా ఫ్రస్ట్రేషన్ వెనుక..
రెజినా కూడా అంత అసహనం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. లైట్ తీసుకుంటే పోయేది.! అన్నట్టు, ఇంటర్వ్యూ సందర్భంగా మొబైల్ ఫోన్లు మోగడం కూడా తట్టుకోలేకపోయిందట రెజినా.!
Also Read: ఇవే.! ఇద్దరూ తగ్గించుకుంటే మంచిది.!
అంటే, ఏదో ఫ్రస్ట్రేషన్ ఆమెను వెంటాడుతోందన్నమాట. దేనిగురించబ్బా.? ఏమోగానీ, ఈ రకంగా ‘శాకిని డాకిని’ సినిమాకి రెజినా ఒకింత అదనపు పబ్లిసిటీ తెచ్చిపెడుతోందన్నమాట.!