Regina Cassandra Secret.. రెజీనా కసాండ్రా..! అప్పుడెప్పుడో ‘శివ మనసులో శృతి (ఎస్ఎమ్ఎస్)’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ ముద్దుగుమ్మ.
తెలుగులో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రెజీనా తెలుగు సినిమాల్లో కనిపించడం కాస్త తగ్గించినట్లు కనిపించినా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా వుంది.
హీరోయిన్గా సినిమాలు చేస్తూనే మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకుంది.
Regina Cassandra Secret.. అసలు సంగతి ఇదే..
అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా తన అసలు పేరు ఇది కాదు.. అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అసలు వివరాల్లోకి వెళితే..

రెజీనా పుట్టినప్పుడు ఇస్లాం మతస్థురాలిగా పుట్టిందట. క్రిస్టియన్ మతస్థురాలైన రెజీనా తల్లి, ముశ్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో రెజీనా ముశ్లిం మతస్థురాలిగా జన్మించింది.
కానీ, ఆ తర్వాత రెజీనా తల్లి తండ్రులు విడాకులు తీసుకుని విడిపోవడంతో, తల్లి కారణంగా బాప్టిజం తీసుకున్నానని రెజీనా చెప్పుకోచ్చింది.
ఆ బేధాలసలే లేవంటోంది
అలా ముశ్లింగా పుట్టిన రెజీనా క్రిస్టియన్‌గా మారాల్సి వచ్చిందట. తనకు ఆరేళ్ల వయసున్నప్పుడే ఇదంతా జరిగిందట. అప్పుడే తన తల్లి తన పేరు చివరన ‘కసాండ్రా’ చేర్చిందట.
అలా రెజీనా కాస్తా ‘రెజీనా కసాండ్రా’ అయ్యిందట. అదే పేరుతో ఇప్పుడు నటిగా కొనసాగుతోంది రెజీనా. అయితే తనకు ఎలాంటి మతా విభేదాల్లేవంటోంది రెజీనా.

అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తానని చెబుతోంది. గుడికి వెళతాను.. చర్చికి వెళతాను.. అలాగే మసీదుకు వెళ్లి ప్రార్ధనలు కూడా చేస్తానని రెజీనా చెబుతోంది.
Also Read: ఎర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి: తప్పొప్పుల పంచాయితీ.!
ప్రస్తుతం రెజీనా చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. కొన్ని తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌లతోనూ రెజీనా బిజీగా వుంది.
గతంలో రెజీనా నటించిన ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
