Renu Desai About Pawankalyan..సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాజీ సతీమణి, సినీ నటి రేణు దేశాయ్ సెన్సేషనల్ వీడియో విడుదల చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, ఆమె పోస్ట్ చేసిన వీడియోలో, ‘పవన్ కళ్యాణ్‌తో వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి. నిజమే, నేను బాధపడ్డాను. కానీ, అది ముగిసిన కథ..’ అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద వెబ్ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.. అది మంచి పని కాదు..’ అంటూ రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘మీ రాజకీయాల్లోకి ఆడవాళ్ళని లాగకండి.. పిల్లల్ని అసలే లాగకండి. ఎవరి పిల్లల్నీ లాగకండి..’ అంటూ సూచించారు రేణు దేశాయ్.
Renu Desai About Pawankalyan.. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత విషయాలు వేరు..
నన్ను అభిమానించేవారు, నన్ను ద్వేషించేవారు.. ఎవరైనాసరే, రాజకీయాలు వేరు.. వ్యక్తిగత విషయాలు వేరని గుర్తించాలంటూ రేణు దేశాయ్ సూచించడం గమనార్హం.

‘ఇప్పటికీ చెబుతున్నా.. కుటుంబాన్ని కాదనుకుని.. సొంత పిల్లల్ని కూడా కాదనుకుని.. లగ్జరియస్ లైఫ్ వదులుకుని.. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెప్పారు రేణు దేశాయ్.
సమాజానికి మంచి చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్‌కి అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పుడూ మద్దతిస్తానంటూ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయానికి చురకలంటించిన రేణు దేశాయ్..
‘నాకు చేతనైనంత నేను చేస్తున్నాను. ఇలా ఈ వీడియో చేస్తున్నది కూడా అదే. పవన్ కళ్యాణ్‌ని అభిమానించేవారు కూడా.. రాజకీయాల్లో ఆయనకు అండగా నిలబడండి’ అని రేణు దేశాయ్ (Renu Desai) పిలుపునివ్వడం గమనార్హం.
‘రాజకీయంగా ఏమైనా వుంటే, పవన్ కళ్యాణ్‌తో తేల్చుకోవాలిగానీ.. పిల్లల ప్రస్తావన రాజకీయాల్లో తీసుకురావద్దు..’ అని సోకాల్డ్ పొలిటీషియన్లకి రేణు దేశాయ్ చురకలంటించారు.
Also Read: నడి రోడ్డు మీద ‘నిస్సిగ్గు రాజకీయం’ గుడ్డలూడదీసిన ‘బ్రో’.!
ప్రతిసారీ, రేణు దేశాయ్ పేరు ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ మీద జుగుప్సాకరమైన ఆరోపణలు చేయడం కొందరు రాజకీయ నాయకులకి అలవాటైపోయింది.
అలాంటివారందరికీ, చెప్పుతో కొట్టినట్లయ్యింది రేణు దేశాయ్ (Renu Desai) విడుదల చేసిన వీడియో.