అసలు రేణు దేశాయ్‌ని నెటిజనం ఎందుకు తిడుతున్నారు.? సోషల్ మీడియా (Renu Desai Social Negativity) అంటేనే అంత.! సోషల్ మీడియాని కంట్రోల్ చెయ్యలేం.
తిట్టేవాడు తిడతాడు.. పొగిడేవాడు పొగుడుతాడు.! ఇది సోషల్ మేనియా.! మేనియాక్స్ ఎక్కువమంది వుండే ‘ఏరియా’ ఇది.!
సినీ నటి రేణు దేశాయ్, కొన్నాళ్ళపాటు సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేశారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్.. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. ఆ తర్వాత ఇరువురూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
అయితే, తాను మోసపోయాననీ.. తనను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మోసం చేశారనీ అంటోంది రేణు దేశాయ్. విడాకులకు కారణం కూడా అదేనన్నది రేణు దేశాయ్ వాదన.
కానీ, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మంచోడట. ఆయనకే తన సపోర్ట్ అంటోంది.! మోసగాడెలా మంచోడవుతాడు.? మంచోడు, మోసగాడెలా అవుతాడు.?
Renu Desai Social Negativity.. ఏది నిజం.?
ఇదే అసలు సమస్య. ‘నేను అన్నీ నిజాలే మాట్లాడుతున్నాను..’ అని చెబుతున్నారు రేణు దేశాయ్. ఆమెకది నిజమే కావొచ్చు.. అందరూ దాన్ని నిజమని నమ్మలానే రూల్ లేదు కదా.!
పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన విడాకుల గురించి ఎక్కడా రేణు దేశాయ్‌ని విమర్శించలేదు. ఆ విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు.
సరే, ఇద్దరి మధ్యా ఏం జరిగింది.? అన్నది ఆ ఇద్దరికీ సంబంధించిన విషయం. వైవాహిక జీవితం రద్దయ్యాక, ఆలుమగలుగా ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించిన చర్చ అనవసరం.
Also Read: Pranitha Subhash బాపుగారి బొమ్మే.! బుట్టబొమ్మలా.!
అప్పట్లో ‘మోసం’ గురించి ‘నిజం’ చెబితే, పవన్ కళ్యాణ్ అభిమానులు బూతులు తిట్టారంటూ రేణు దేశాయ్ పదే పదే వాపోతోంది.
ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ మంచితనం గురించి చెబుతోంటే.. పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించేవారు బూతులు తిడుతున్నారంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వాపోతుండడం గమనార్హం.

అప్పుడూ.. ఇప్పుడూ.. తననే తిడుతున్నారంటూ రేణు దేశాయ్ (Renu Desai) ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పు లేదు.! కానీ, ముందే చెప్పుకున్నట్టు ఇది సోషల్ మీడియా యుగం.
మోసగాడు.. మంచోడు.. అంటూ పవన్ కళ్యాణ్ మీద భిన్నమైన వ్యాఖ్యలు రేణు దేశాయ్ చేస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్‌ని అభిమానించేవాళ్ళు ఒకలా.. ఆయన్ని ద్వేషించేవాళ్ళు ఇంకోలా స్పందిస్తారు కదా.?
అయినాగానీ, బూతులు తిట్టడం సబబు కాదు.! రేణు దేశాయ్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని సమర్థించే హక్కు.. అలాగే, తప్పు పట్టే హక్కు అయితే ఎవరికైనా వుండొచ్చు.