చనిపోయినవారికి నివాళులు తెలిపే క్రమంలో.. శ్రద్ధాంజలి ఘటించే క్రమంలో.. ‘రెస్ట్ ఇన్ పీస్’ (Rest In Peace) అనే మాట తరచూ ఉపయోగిస్తుంటాం. కానీ, ‘ఓ రోజు మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం..’ అని అనడం అంటే చాలా అరుదైన విషయమే. నిజానికి, ఇది చాలా అరుదైన ఎక్స్‌ప్రెషన్.
బిగ్‌బాస్ ఫేం, టీవీ నటుడు సిద్దార్ధ (Siddharth Shukla) శుక్లా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ‘చాలా తొందరగా వెళ్ళిపోయావ్ మిత్రమా..’ అంటూ బాలీవుడ్ సినీ జనం, హిందీ బుల్లితెర నటీనటులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించేశారు.
చనిపోయిన వ్యక్తిని (Rest In Peace) మళ్ళీ కలుద్దామంటుందేంటీ.?
ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) ఇంకాస్త కొత్తగా శ్రద్ధాంజలి ఘటించింది. ‘ఇప్పుడు నువ్వు మరింత మంచి ప్రదేశంలో వున్నావని నాకు తెలుసు. ఖచ్చితంగా మనం ఓ రోజు మళ్ళీ కలుసుకుంటాం..’ అంటూ సోషల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేసింది. ‘తొందరగా వెళ్ళిపోయావ్ మిత్రమా..’ అని షెఫాలీ జరీవాలా పేర్కొనడం గమనార్హం.
షెఫాలీ జరీవాలాకి సిద్దార్ధ శుక్లా అత్యంత సన్నిహితుడు. ఆమె మాటల్లోనే అతను ఆమెకు ఎంత మంచి స్నేహితుడో అర్థమవుతోంది. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ మనం కలుస్తాం.. అని చెప్పడమంటే, చాలా చాలా ప్రత్యేకమైన బంధం ఈ ఇద్దరి మధ్యా వుందనే కదా అర్థం.
షెఫాలీ మాత్రమే కాదు, చాలామంది బాలీవుడ్ నటీనటులతో సిద్దార్ధ శుక్లాకి సన్నిహిత సబంధాలున్నాయి. వారంతా అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే (40 ఏళ్ళు) సిద్దార్ధ శుక్లా గుండెపోటు కారణంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. కెరీర్ పరంగా ఇంకా ఎన్నో ఎత్తుల్ని చూడాల్సిన సిద్దార్ధ హఠాన్మరణం చెందడం బాధాకరమే.