RGV Baba Josyam వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుుడు జోస్యం, భవిష్యవాణి.. ఇలా రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో చెప్పే బాబా అవతారమెత్తాడు.!
నిజ్జంగా నిజమిది.! గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెన్నంటే వున్న రాజు రవితేజ గురించి ‘వెన్నుపోటు’ జోస్యం చెప్పాడట వర్మ.!
‘అది నిజమయ్యింది.. పవన్ కళ్యాణ్‌కి రాజు రవితేజ నుంచి వెన్నుపోటు తప్పలేదు..’ అంటూ వర్మ తాజాగా ఓ ట్వీటేశాడు.
RGV Baba Josyam ఆర్జీవీ.. ఓ గొర్రెల మంద.!
ప్చ్.! ఆర్జీవీ ఏం మాట్లాడినా, ‘అది నిజమే’ అని నమ్మే పేటీఎం గొర్రెల మంద ఒకటుంది. సో, ఆయన ఇలాంటి పిట్ట జోస్యాలు చెప్పడంలో వింతేముంది.?
స్వర్గీయ ఎన్టీయార్‌ని నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారు గనుక, ఆ నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్‌కి వెన్నుపోటు పొడవడం ఖాయమన్నది వర్మ తాజా జోస్యం.!

‘నేను ఎన్టీయార్‌కి వెన్నుపోటు పొడవలేదు.. ఎన్టీయారే నాకు వెన్నుపోటు పొడిచాడు’ అంటారు నాదెండ్ల భాస్కర్ రావు. అది వేరే సంగతి.
ఆర్జీవీ బాబా.. ఇంకెందుకు ఎన్నికలు.?
రామ్ గోపాల్ వర్మ చెప్పిందే నిజమవుతుందట.! ఇంకెందుకు దేశంలో ఎన్నికలు.? ప్రజాస్వామ్యం.? రాజకీయ పార్టీలు.? వ్యూహాలు.. ఎత్తుగడలు.. ఎన్నికల ప్రచారాలు…?
గెలిచేదెవరో ఆర్జీవీ చెబుతాడు గనుక, ఓడిపోయేవాళ్ళు ముందే పోటీ నుంచి తప్పుకుంటే మంచిది. రాజకీయాల మీద జోస్యం చెప్పడం మానేసి, ముందైతే హిట్టు సినిమాలెలా చేయాలో ఆర్జీవీ తెలుసుకుంటే మంచిది.!
Also Read: పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాక్ అయిన ఆ హీరో ఎవరు.?
బాబా ఆర్జీవీకి ఈ విషయంలో మాత్రం పెద్దగా ‘జోస్యం’ తెలియదు. లేదంటే, తన జోస్యం తనకు పనిచేయదని ఆర్జీవీ బాబా (Ram Gopal Varma Baba) ఫీలవుతున్నాడేమో.!
ఛత్.! ఇంత సోది.. మళ్ళీ ఆర్జీవీ (Ram Gopal Varma) మీద.! ఇదో నాన్సెన్స్.!