రామ్ గోపాల్ వర్మని ఏ ప్రశ్న అడక్కూడదో అలాంటి ప్రశ్నే పదే పదే ఎందుకు అడుగుతుంటుంది మీడియా.? అదంతే, వర్మని ఎలాగోలా కెలికి తమక్కావాల్సిన ‘విషయాన్ని’ రాబట్టుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకి అలాంట ‘స్టఫ్’ (RGV Ram Gopal Varma About Politics and Movies) ఇవ్వడానికి ఆయన కూడా ఎప్పుడూ సిద్ధంగానే వుంటాడు.
కొత్త విషయమేమీ కాదిది.. రామ్ గోపాల్ వర్మకి సమాజం పట్ల బాధ్యత లేదు. ఈ విషయాన్ని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పాడు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్ని తానెప్పుడూ తీయబోనని చెబుతాడు. అంతేనా, రాజకీయాల పట్ల తనకు ఆసక్త లేదనీ అంటాడు.
అయినాగానీ, వర్మని.. రాజకీయాల్లోకి వస్తారా.? అని ప్రశ్నిస్తుంటారు. ప్రశ్నించేవారికి అదో తుత్తి. ఆ తుత్తిని వర్మ (Ram Gopal Varma RGV) బీభత్సంగా ఎంజాయ్ చేసేస్తుంటాడు. ఒక్కోసారి అలా తనను ప్రశ్నించేవారిని చూసి వర్మ చాలా చులకనగా మాట్లాడుతుంటాడు. పాపం.. వాళ్ళకే ఆ విషయం అర్థం కాక ఓ తింగరి నవ్వు నవ్వేస్తుంటారనుకోండి. అది వేరే సంగతి.
వర్మకి రాజకీయాలంటే ఆసక్తి లేదని అనలేం. ఆయన తీసే సినిమాల్లో కొన్నింటిని ప్రత్యేకంగా కొందరి కోసం చేస్తుంటాడు. అలా సినిమాలు తీసే క్రమంలో ఆయా అంశాలపై అవగాహన కూడా పెంచుకుంటాడు. ఎవరో చెప్పిన మీదట, ఎవర్నో టార్గెట్ చెయ్యడానికి.. తగిన పాత్రల్నీ ఎంచుకుంటాడు. ఇదంతా అతని వృత్తిపరమైన కమిట్మెంట్ అనుకోవాలంతే. అంతకు మించి, ఇంకేమీ అనలేం.
తాజాగా ఇంకోసారి రాజకీయాల విషయమై వర్మని ప్రశ్నించారు. వర్మ పరమ రొటీన్ సమాధానం చెప్పాడు. తనకు తాను సేవ చేసుకోలేకపోతున్నాననీ, దానికే సమయం లేదనీ, ప్రజలకెలా సేవ చేస్తాననీ సెలవిచ్చాడు. కామెడీ కాకపోతే, రాజకీయాల్లోకి ఇప్పుడెవడైనా ప్రజా సేవ కోసం (RGV Ram Gopal Varma About Politics and Movies) వస్తున్నాడా.? ఇప్పటికే రాజకీయాల్లో వున్నోళ్ళు, అధికారంలో వున్నోళ్ళూ ప్రజాసేవ చేసేస్తున్నారా.? అందరూ చేసుకుంటున్నది తమ సొంత సేవ మాత్రమే. సో, వర్మ ఎంచక్కా రాజకీయాల్లోకి వచ్చేయొచ్చు.