Rhea Chakraborty.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఔను, బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత ‘గ్లామర్ షో’ షురూ చేసింది.!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిపై ఆరోపణలు వచ్చాయి. రియా – సుశాంత్ అంతకు ముందు ప్రేమలో వుండడమే అందుక్కారణం.
అంతే కాదు, రియా చక్రవర్తిపై డ్రగ్స్ కేసు కూడా నడుస్తోంది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేశారు కూడా. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద విడుదలైంది.
వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరి.!
అటు సుశాంత్ (Sushant Rhea) బలవన్మరణం కేసులో ఆరోపణలు, ఇటు డ్రగ్స్ కేసులో ఆరోపణలతో రియా చక్రవర్తి జీవితం అయోమయంలో పడిపోయింది. కానీ, కోలుకుందామె.!

అయితే, ఇంకా సోషల్ మీడియా వేదికగా రియా చక్రవర్తిపై ట్రోలింగ్ జరుగుతూనే వుంది. ఇంకా ఎన్నాళ్ళిలా.?
ఏమోగానీ, రియా చక్రవర్తి మళ్ళీ సోషల్ మీడియా వేదికగా ‘గ్లామర్ షో’ మొదలెట్టేసరికి, గత వివాదాలు తెరమరగయిపోతాయన్న అభిప్రాయం ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
Rhea Chakraborty మళ్ళీ తెలుగులో నటిస్తుందా.?
తెలుగులో (Tollywood) ఆమె చేసిన తొలి సినిమా ‘తూనీగ తూనీగ’. సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin) హీరో. మళ్ళీ తెలుగులో నటించాలని వుందంటూ ఆ మధ్య చెప్పింది రియా చక్రవర్తి.
టాలీవుడ్ నుంచి ఈ మధ్యనే ఓ ఆఫర్ ఆమె ముందుకు వెళ్ళిందట కూడా. అయితే, ఆ ప్రాజెక్ట్ ఏమయ్యిందన్నది తెలియరాలేదు.
Also Read: ఓసీడీ.. రెజినా ఆవేదన అర్థం చేసుకోదగ్గదేగానీ.!
బాలీవుడ్ (Bollywood) నుంచి మాత్రం ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. అయితే, డ్రగ్స్ కేసు కారణంగా.. రియా (Rhea) ఎప్పుడు మళ్ళీ అరెస్టవుతుందోనన్న అనుమానంతో ఆమెకు సినిమాలిచ్చేందుకు దర్శక నిర్మాతలు తటపటాయిస్తున్నారట.
ఆ సంగతి అలా వుంటే, సోషల్ మీడియాలో తాజాగా రియా చక్రవర్తి పోస్ట్ చేసిన ఫొటోలతో ‘గ్లామర్ డాల్ రియా చక్రవర్తి ఈజ్ బ్యాక్..’ అంటున్నారు నెటిజనం. ఆ స్థాయిలోనే గ్లామర్ షో చేసింది ఈ బ్యూటీ.!