పాపులారిటీ పెరగాలంటే.. రెండు మార్గాలుంటాయి. ఒకటి మంచి మార్గం. ఇంకోటి చెడు మార్గం. ఎవరు ఏ మార్గంలో వెళుతున్నారు.? అన్నది ఇక్కడ అనవసరం పాపులారిటీకి సంబంధించినంతవరకు. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty The Most Desirable Woman) మోస్ట్ డిజైరబుల్ విమెన్ కేటగిరీలో నెంబర్ వన్ స్థానం ఎలా సంపాదించిందంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
రియా చక్రవర్తి పేరు సినిమాల పరంగా కాకుండా, వివాదాల కోణంలో మార్మోగిపోతోంది గత కొంత కాలంగా. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ రాజ్ పుట్ (Sushant Singh Rajput Death Mystery) అనుమానాస్పద మరణం కేసులో రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడమే అందుక్కారణం. రియా – సుశాంత్ మధ్య ప్రేమ బంధం వుంది. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు.

అయితే, సుశాంత్ మరణానికి రియా చకవర్తి కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేనా, రియా చక్రవర్తి పేరు డ్రగ్స్ కేసులోనూ ప్రముఖంగా వినిపించింది. ఆమె అరెస్టయ్యింది.. ఎలాగోలా ఆ తర్వాత బెయిల్ పొందిందనుకోండి.. అది వేరే సంగతి.
ముందే చెప్పుకున్నాం కదా.. పాపులారిటీ ఎలాగైనా రావొచ్చు. రియా చక్రవర్తి తప్పు చేసి, పాపులారిటీ పొందిందని అనలేం. ఆమె తప్పు చేసిందా.? లేదా.? అన్నది కోర్టులు తేల్చాలి. కానీ, ఆమె పేరు చుట్టూ నడిచిన వివాదాలే ఆమెను మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.
ఇదిలా వుంటే, గడచిపోయిన చేదు సంఘటనల్ని మర్చిపోయి తిరిగి సినిమాల్లో రాణించాలనుకుంటోంది రియా చక్రవర్తి (Rhea Chakraborty The Most Desirable Woman).