Ritika Nayak AI Mirai.. ‘మిరాయ్’ సినిమాలో హీరోయిన్ లేదంట.. AI తో క్రియేట్ చేసిన బొమ్మనే హీరోయిన్‌గా వాడేశారంట.
అందుకే సినిమాలో ‘విభ’ పాత్రలో కనిపించిన అమ్మాయ్ అంత క్యూట్‌గా కనిపించిందట.
‘మిరాయ్’ చూసిన చాలా మంది ఆడియన్స్‌కి హీరోయిన్ పాత్ర విషయంలో వున్న అభిప్రాయాలివే.. సోషల్ మీడియాలోనూ ఓ వర్గం ఆడియన్స్‌లోనూ ఈ రకమైన డిస్కషన్స్ వినిపిస్తున్నాయ్.
ఏంటి మరి..! నిజంగానే హీరోయిన్ రితికా నాయక్ ఈ సినిమాలో నటించలేదా.? నిజగానే AI బొమ్మేనా.!
Ritika Nayak AI Mirai.. ‘ఏఐ’ బొమ్మ కాదు అమ్మాయే..!
కానే కాదు.. ‘విభ’ పాత్రలో కనిపించిన క్యూట్ బ్యూటీ అక్షరాలా రియల్ బొమ్మే. బై బర్త్ అందాల బొమ్మ. నమ్మనంటారా.? కావాలంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజుగారిచే చెప్పించాలా.?
అదేమంత పని కాదండోయ్. చెప్పించేద్దాం. నిజంగా అండి.! ‘మిరాయ్’ సినిమా రీసెంట్‌గా రిలీజై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సక్సెస్ మీట్‌కి సినీ ప్రముఖులతో పాటూ, పలువురు రాజకీయ నాయకులు హజరయ్యారు.
ఈ కార్యక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు నోట హీరోయిన్ మాట ప్రస్థావనకొచ్చింది.
డిప్యూటీ స్పీకర్ నోట హీరోయిన్ మాట.!
‘సినిమాలో నటించింది నిజంగా అమ్మాయే. AI బొమ్మ కానే కాదు. చాలా క్యూట్‌గా కనిపించింది. బాగా నటించింది..’ అని రితికా సింగ్‌ని వుద్దేశించి రఘు రామ కృష్ణ రాజు స్వయంగా చెప్పడం విశేషం.

ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. క్యూట్ బ్యూటీ రితికా నాయక్ ఇంకా క్యూట్‌గా ట్రెండింగ్ అవుతోంది. అవును నిజమే సినిమాలో ఆమె లుక్స్ చాలా క్యూట్‌గా వున్నాయ్.
Also Read: దీపిక పదుకొనె స్కూల్.! కొత్త జర్నీ షురూ.!
సినిమా రిలీజ్ తర్వాత కూడా ఆమె పలు టీవీ షోలలోనూ, సక్సెస్ మీట్స్‌లోనూ పాల్గొంటోంది అంతే క్యూట్‌గా.! రితికా నాయక్‌లో వుందిలే ఆ వైబుందిలే మరి.
అన్నట్లు సినిమాలో ‘వైబుందిలే..’ సాంగ్ తీసేయడం ఒకింత విచారకరమే.
కానీ, నెట్టింట ఈ పాట క్రియేట్ చేస్తున్న ట్రెండింగ్ ‘వైబ్’ అంతా ఇంతా కాదండోయ్..!
