Ritu Varma Telugammai.. పదహారణాల తెలుగమ్మాయ్ రీతూ వర్మకి పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మకి ‘పెళ్లి చూపులు’ సినిమా హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత వరుస అవకాశాలొచ్చాయ్ ఆమెకి. అయితే, సెలెక్టివ్‌గా కథలను ఎంచుకునే రీతూ వర్మ ఇటు తెలుగుతో పాటూ తమిళంలోనూ హవా చూపిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘స్వాగ్’ సినిమాలో మహారాణీ పాత్రలో కనిపించి మెప్పించింది. ఫస్ట్ టైమ్ రెట్రో లుక్స్‌లో కనిపించింది ఈ సినిమా కోసం రీతూ వర్మ.
Ritu Varma Telugammai.. కామెడీ అంటే చాలా ఇష్టం
తాజాగా, సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ‘మజాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంచి విషయమున్న డైరెక్టర్ నక్కిన త్రినాధరావు ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలున్నాయ్.

సినిమా ప్రమోషన్లు కూడా బాగా జరుగుతుండడంతో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ బాగానే వుంది. ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి హిట్టు కళ కూడా బాగానే కనిపిస్తోంది.
ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న రీతూ వర్మ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు అభిమానులతో పంచుకుంది.
ఆ సత్తా కూడా వుందండోయ్..
నటిగా నిలబడాలంటే అన్ని రకాల పాత్రలూ ట్రై చేయాలని చెబుతోంది. అందులో కామెడీ కూడా ప్రధానంగా వుంటుందంటోంది. తనకు కామెడీ చేయడం చాలా ఇష్టమంటోంది.

విడుదలకు సిద్ధమైన ‘మజాకా’ సినిమా ఆ తరహాలోనిదే అని రీతూ వర్మ చెబుతోంది. కామెడీతో పాటూ, తనకు యాక్షన్ సినిమాల్లోనూ నటించాలని వుందని చెబుతోంది.
Also Read: రాధికా ఆప్టే.! ఆమె ఏం చేసినా సంచలనమే.!
ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్‌లో ఇంటెన్స్‌గా నటించగలిగే సత్తా తనకుందని, అయితే, ఆ తరహా కథలు ఇంతవరకూ తన వద్దకు రాలేదంటోంది అందాల రీతూ వర్మ.
అలాగే ఓ పూర్తి స్థాయి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ కోసం కూడా ఎదురు చూస్తున్నానంటోంది.

ఏది ఏమైతేనేం, నటిగా తాను ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు ఎంతో సంతృప్తినిచ్చాయనీ.. మరిన్ని కొత్త తరహా పాత్రల్లో నటించాలనుందంటోంది రీతూ.
గ్లామరూ.. దాంతోపాటే, యాక్టింగ్ గ్రామరూ తెలిసిన తెలుగమ్మాయ్ రీతూ వర్మకి, స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులొస్తే, స్టార్ హీరోయిన్ అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.