Robinhood Nithin.. వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ సినిమా రాబోతోంది.
మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రాబిన్ హుడ్’ సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ఎప్పుడో క్రిస్‌మస్‌కి రిలీజ్ కావల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు మార్చిలో డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా అలాగే వాయిదాలు పడుతూ వచ్చాయ్. అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాలేదు.
Robinhood Nithin.. సొంత సెటైర్లు..
దాంతో, చిత్ర యూనిట్ తమ వాయిదాల పర్వంపై వాళ్లకు వాళ్లే సెటైర్లు వేసుకుంటూ, ప్రమోషన్లను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు.
ఇక, సినిమా విషయానికి వస్తే.. మాస్ రాజా రవితేజ నటించిన ‘కిక్’ ఫ్లేవర్ ఈ సినిమాలో కనిపిస్తోంది. అలాగే ‘భీష్మ’ తరహాలో పక్కా ఎంటర్‌టైనర్ అవుతుందని కూడా తోస్తోంది.
అన్నట్లు ఈ సినిమాలో మొదట రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటించాల్సి వుంది. డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రెండు సినిమాలూ (ఛలో, భీష్మ) సూపర్ డూపర్ హిట్ అయ్యాయ్. రెండు సినిమాల్లోనూ రష్మికనే హీరోయిన్.
పాపం శ్రీలీల.! ఆ నింద పోయేనా.!
అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలోనూ రష్మికనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. కానీ, రష్మిక హ్యాండివ్వడంతో ఆ ప్లేస్‌లోకి శ్రీలీల వచ్చి చేరింది.
ఈ మధ్య శ్రీ లీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయన్న టాక్ వుంది. దాంతో ఐరెన్ లెగ్’ అనే నిందను కూడా మోస్తోంది శ్రీలీల.
మరి, ‘రాబిన్ హుడ్’ హిట్ అయ్యిందంటే ఆ నింద నుంచి తప్పించుకునే అవకాశం వుంటుంది శ్రీలీలకి. ‘రాబిన్ హుడ్’కి హిట్టు కళయితే కనిపిస్తోంది. చూడాలి మరి.