Roja Selvamani సినీ నటి రోజా, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ‘టీడీపీ మహఇళా విభాగం’ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.
రాజకీయాలన్నాక విమర్శలు సహజం. అయితే, రోజా రాకతో రాజకీయాల్లో విమర్శల తీవ్రత కొత్త పుంతలు తొక్కిన మాట వాస్తవం.
విమర్శలు హద్దులు దాటాయ్. అందుకు కారణం రోజా.. అని అనడం సబబు కాదుగానీ, సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా, రాజకీయ విమర్శల పంథాలో కొత్త పుంతలు తొక్కారని మాత్రం చెప్పొచ్చు.
వైసీపీ నేతగానూ రోజా చేసిన, చేస్తున్న రాజకీయ విమర్శల తీవ్రత తక్కువేమీ కాదు. గతంలో చిరంజీవిపై (అప్పటి ప్రజారాజ్యం అధినేత) రోజా చేసిన విమర్శల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Roja Selvamani తనదాకా వస్తేగానీ తలనొప్పి తెలియలేదా.?
కొన్నాళ్ళ క్రితం రోజాపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఆ మాటకొస్తే రోజాపై ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కానీ, ఆ ట్రోలింగ్ మరీ దారుణం.
రోజాకి ఆమె సోదరుడితో ‘లింకు’ పెట్టారు కొందరు. ఆ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంటతడి పెట్టారామె.
Also Read: Mega Star Chiranjeevi ‘పబ్లిసిటీ రైలు’.! బుర్ర చెడిందేమో.!
‘ఒక అమ్మకీ ఒక అబ్బకీ పుట్టలేదు వాళ్ళు..’ అంటూ తనపై జుగుప్సాకరంగా విమర్శలు చేసినవారిని ఉద్దేశించి రోజా మండిపడ్డారు.
నిజమే, ఈ విషయంలో రోజాని తప్పు పట్టలేం. ఆమె ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. కానీ, ఆమె తన రాజకీయ ప్రత్యర్థులపై చేసే విమర్శల మాటేమిటి.? వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా.?