RRR Mass Anthem మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీయార్.. తెలుగు సినిమా పరిశ్రమలో ది బెస్ట్ డాన్సర్స్ లిస్టులో టాప్ ప్లేస్‌లో వుంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి, ఈ రెండు డాన్సింగ్ డైనమైట్లు.. ఓ పాటలో.. అందునా వీర నాటు మాస్ పాటకి స్టెప్పులేస్తే ఎలా వుంటుంది.?
ఇదిగో ఇలా వుంటుందంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ‘నాటు.. నాటు..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. సాంగ్ ప్రోమోతోనే ఈ పాటపై అంచనాలు అమాంతం పదింతలైతే, ఇప్పుడీ లిరికల్ సాంగ్ పుణ్యమా.. అని, అంచనాలు అంతకు మించి పెరిగిపోయాయ్.
RRR Mass Anthem.. నాటు.. డైనమైటు..
ఏం నాటు పాట ఇది.? ఏం మాస్ పాట ఇది.? మెంటల్.. అంటూ సమంత స్పందిస్తే, డైనమైట్ అని మరో సినీ ప్రముఖుడు స్పందించాడు. ఈ పాటను అభివర్ణించడానికి సరికొత్త పదాల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రపీ ఈ పాటని వేరే లెవల్‌కి తీసుకెళ్ళింది.

చరణ్, ఎన్టీయార్.. ఒకరితో ఒకరు పోటీ పడటం అనేది చిన్న మాట. ఇద్దరూ చాలా ఎంజాయ్ చేశారు.. ఈ పాటకి డాన్స్ చేస్తున్న సమయంలో. అయితే, చిన్న నిరాశ.. లిరికల్ సాంగ్‌లో స్టెప్పుల్ని (RRR Mass Anthem) చాలా పొదుపుగా మాత్రమే చూపించారు. అంటే, పేలాల్సిన డైనమైట్ చాలా చాలా పెద్దదే వుందన్నమాట.
Also Read: అన్నదమ్ముల అనుబంధమిది.. కులగజ్జితో కొట్టకు చావొద్దు ప్లీజ్.!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం.
2022 సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.