RRR Movie Pre Review: తెలుగు సినిమాకి సంబంధించి ఇదొక అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా.
భారీ మల్టీస్టారర్ అనే కాదు.. ‘బాహుబలి’ (Baahubali) తర్వాత జక్కన్న రాజమౌళి నుంచి వస్తోన్న ఇండియన్ సినిమాగా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. మొత్తంగా యావత్ భారతావని ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురుచూస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో సినిమా సెట్ చేయడమే రాజమౌళి సాధించిన తొలి విజయం. ఏం, ఎందుకు ఈ ఇద్దరూ కలవకూడదు.? అన్న ప్రశ్న సహజంగానే పుట్టుకొస్తుంది.
కానీ, ఈ ఇద్దరికీ వున్న అభిమానులు.. చరణ్, ఎన్టీయార్ సినిమాల మధ్య నడిచే పోటీ, అభిమానుల మధ్య ఆధిపత్యపోరు.. ఇవన్నీ తెలియనిదెవరికి.? అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ చాలా చాలా స్పెషల్ మూవీ తెలుగు సినిమాకి సంబంధించినంతవరకు.
RRR Movie Pre Review.. కాంబినేషనూ.. కాన్సెప్టూ.!
కాంబినేషన్ కంటే, ఇందులో కాన్సెప్ట్ మరింత ప్రత్యేకమైనది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి మహనీయుల్ని.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ప్రధాన పాత్రల ద్వారా చూపించడమేంటి.?
పైగా, ఆయా వ్యక్తులు కాదు, వాళ్ళ స్వభావాలు ఈ సినిమాలోని హీరోల్లో కనిపిస్తాయని చెప్పడమేంటి.?
దేశభక్తి సినిమా కాదంటాడు.. ‘ఎత్తర జెండా’ అంటూ పాట తీస్తాడు.! ఏంటో, అంతా కొత్తగా అనిపిస్తోంది కదూ.! దటీజ్ రాజమౌళి.
తెరపై అందంగా కథ చెప్పడంలో రాజమౌళి ఎంత గొప్పోడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి, రాజమౌళి చెప్పే కథలో పాత్రలెలా వుండాలి.? ఆ పాత్రల్లో నటించే నటీనటులెలా వుండాలి.?
చరణ్ (Mega Power Star Ram Charan)స్వభావం చాలా ‘కామ్ అండ్ కంపోజ్డ్’. యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) అంటే ‘యారోగెంట్’.! ఆ స్వభావాల్నే ఆయా పాత్రలకూ అద్దాడు జక్కన్న. ఇది ఇంకో వింత. నీరూ, నిప్పూ.. అంటూ ఇద్దర్నీ చాలా కొత్తగా చూపించబోతున్నాడు.
అంచనాలు.. అంతకు మించి.!
సినిమా నుంచి ప్రోమోస్ రూపంలో విడుదలైన ఒక్కో విడియో, ఆడియో.. దేనికదే అంతకు మించి.. అనే స్థాయిలో వున్నాయి. కోవిడ్ పాండమిక్ వల్ల సినిమా ఆలస్యమయ్యిందిగానీ, లేదంటే ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడో థియేటర్లలోకి వచ్చేసి వుండేదే.!
ఇంతకీ, ‘బాహుబలి’ రికార్డుల్ని ‘ఆర్ఆర్ఆర్’ తిరగరాస్తుందా.? లేదా.? ఇదే చర్చ ఇప్పుడు.
నో డౌట్, ‘అంతకు మించి’ అనే బలమైన అభిప్రాయమైతే ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. బోల్డంత స్టార్ కాస్టింగ్ వుంది. ఎవరికి వారే సినిమాకి ప్రాణం పెట్టేశారు.

కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్.. ఇలా దేనికదే ఓ అద్భుతం.. అనదగ్గరీతిలో వుండబోతున్నాయ్.!
Also Read: Sitara Ghattamaneni జోరు అదుర్స్.! కానీ, బ్రేకులేసేస్తారేమో.!
ఎందుకంటే ఇది రాజమౌళి (SS Rajamouli) సినిమా. రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా ఓ సాంకేతిక అద్భుతమే అవుతోంది. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయ్.!
మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). ఈ ఇండియన్ సినిమా, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆశిద్దాం.! తెలుగు తెరపై ఇంతకు మించిన మల్టీస్టారర్లు రూపొందాలనీ, మరిన్ని పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా నుంచే రావాలనీ ఆకాంక్షిద్దాం.