RRR Movie Tickets: ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అన్న ప్రశ్న చుట్టూ ‘బాహుబలి’కి వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న అప్పట్లో కనీ వినీ ఎరుగని రీతిలో ట్రెండింగ్ అయ్యింది. కొన్ని విషయాలంతే, ఎప్పుడెలా ఎందుకు ట్రెండింగ్ అవుతాయో చెప్పలేం.
ఇప్పుడేమో, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వంతు.! ‘ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్స్’ అంశం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. టిక్కెట్ కావాలా నాయనా.? అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.
పలువురు సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమతో సంబంధం వున్నవారు, సినీ జర్నలిస్టులు.. సోషల్ మీడియా వేదికగా, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టిక్కెట్లు కావాలంటూ పోస్టులు పెడుతున్నారు.
RRR Movie Tickets దొరుకుతున్నాయా.? లేదా.?
నిజానికి, అలాంటి వారందిరికీ టిక్కెట్లు దొరక్కుండా వుంటాయా.? తెలుగులో అయితే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టిక్కెట్లు నిజంగానే దొరకడంలేదు. అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో షురూ అయిపోయింది.. టిక్కెట్ల ధరలు పెరిగినా, సగటు సినీ ప్రేక్షకుడు ప్రస్తుతానికైతే, ‘తగ్గేదే లే’ అంటున్నాడు.
తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విషయంలోనూ ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్లకు మంచి గిరాకీ వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి, బాలీవుడ్ సంగతేంటి.? అక్కడా హంగామా షురూ అయ్యింది. రాజమౌళి సినిమా కదా, ఆ మాత్రం ‘కిక్కు’ వుంటుంది.
బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ (Aamir Khan) తదితరులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ‘ఇది ఇండియన్ సినిమా.. ఇది మనందరి సినిమా..’ అని ఆమిర్ ఖాన్ లాంటోళ్ళు చెప్పాక, బాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ జోష్ మరింత పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో.!
అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.!
ఇదిలా వుంటే, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగులు చేసేసుకున్న సినీ అభిమానులు, తమ స్నేహితులతో టిక్కెట్లను పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్నేహితులతోనే కాదు, టిక్కెట్లు కావాల్సినవారికి తమ వద్దనున్న అదనపు టిక్కెట్లను ఇచ్చేందుకు సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటున్నారు ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు.
Also Read: ఎన్టీవోడికే డౌటు.. మెరుపు తీగా.! వున్నావా.? లేవా.?
మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ramcharan) అభిమానులు చేస్తున్న ఈ టిక్కెట్ల హంగామా నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంతే.
ఇంతకు ముందెన్నడూ కనిపించని సినిమా టిక్కెట్ల పండగ ఇది.
భారతదేశంలోనే కాదు, విదేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్లు (RRR Movie Tickets) హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ప్రీ రిలీజ్ వసూళ్ళే అనూహ్యంగా వున్నాయని ఇప్పటికే ట్రేడ్ పండితులు చెబుతున్న సంగతి తెలిసిందే.