Home » జక్కన్న కథ: డిసైడ్‌ చేసేది మీరే.!

జక్కన్న కథ: డిసైడ్‌ చేసేది మీరే.!

by hellomudra
0 comments

జక్కన్న రంగంలోకి దిగాడు. యంగ్‌ టైగర్‌ మీసం మెలేశాడు. మెగా పవర్‌ స్టార్‌ సత్తా చాటుతానంటున్నాడు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావ్‌.. ఇదీ తొలుత వర్కింగ్‌ టైటిల్‌ (RRR Title). కానీ అదే మెయిన్‌ టైటిల్‌ అయ్యి కూర్చుంది.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటే ఏంటో మీరే చెప్పండి అంటూ ప్రేక్షకులకు పెద్ద బాధ్యత అప్పగించాడు రాజమౌళి. రాజమౌళి అంటేనే అంత. ఆయన ఏం చేసినా అదో అద్భుతం. రామ్‌చరణ్‌నీ, ఎన్టీఆర్‌నీ ఒకే సినిమాలో నటింపచేయడమంటే అదో పెద్ద సాహసం.

ఎన్టీఆర్‌ (Young Tiger NTR), రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan) మంచి స్నేహితులే కావచ్చు. కానీ అభిమానులు మాత్రం అలా కాదు. తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. నానా రచ్చ చేస్తారు. అలాంటిది ఇప్పుడు అభిమానులంతా ఒక్కటైపోయారు. అదీ రాజమౌళి ప్రత్యేకత. ఇద్దరు అగ్రహీరోల అభిమానుల్ని కలిపిన ఘనత ఖచ్చితంగా రాజమౌళిదే.

దటీజ్ రాజమౌళి (RRR Title)

మామూలుగా అయితే ఏదైనా సినిమా చేయాలనుకుంటున్నప్పుడు ఆ సినిమా విశేషాల్ని ముందే చెప్పేస్తాడు రాజమౌళి (SS Rajamouli). అదే ఆయన ప్రత్యేకత. ఏం తీస్తున్నాడో చెప్పేస్తాడు కాబట్టి, ఇక అక్కడి నుండి సినిమాపై బిజినెస్‌ అంచనాలు మొదలైపోతాయ్‌. ఇప్పుడదే జరుగుతోంది ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విషయంలో.

Rajamouli oka cinema prarambhinchadante, dannoka yajnam la bhavisthadu. Direction maathrame kaadu, Promotion baadhyathalu, marketing baadhyataloo theesukuntadu. Okka matalo cheppalante Rajamouli is an all rounder.

మన్యం వీరుడు అల్లూరి పాత్రలో రామ్ చరణ్

గతంతో పోల్చితే కొంత లేట్‌గా అంటే సినిమా షూటింగ్‌ జరిగిపోతుండగా మధ్యలో ప్రెస్‌ మీట్‌ పెట్టి వివరాలు చెప్పాడు రాజమౌళి (SS Rajamouli – Jakkanna). అల్లూరి సీతారామరాజుగా (Alluri Seetha Ramaraju) రామ్‌చరణ్‌ కనిపించబోతున్నాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలియనిదెవ్వరికి.? ఆ పాత్రలో నటించడమంటే ఆషా మాషీ విషయం కాదు.

రామ్‌చరణ్‌కి ఇది నిజంగానే ఛాలెంజింగ్‌ రోల్‌. ‘రంగస్థలం’ (Rangasthalam)కి ముందు, ‘రంగస్థలం’కి తర్వాత.. ఇదీ రామ్‌చరణ్‌ గురించి ప్రతీ ఒక్కరూ చెప్పే మాట. నిజమే ‘చిట్టిబాబు’గా తన నటనతో అందర్నీ మెప్పించిన చరణ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోవడం నూటికి నూరు పాళ్లూ తథ్యం.

జూలు విదల్చనున్న యంగ్ టైగర్.. (RRR Title)

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే, నటుడిగా కొత్తగా చెప్పేదేముంది. విలక్షణ పాత్రలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. అయినా కానీ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్‌ పాత్ర ఎన్టీఆర్‌కి ఖచ్చితంగా సవాల్‌ విసురుతుంది. ఆ సవాల్‌ని స్వీకరించాడు ఎన్టీఆర్‌.

ప్రతి సినిమాకీ యంగ్ టైగర్ తన నట విశ్వరూపాన్ని చూపుతూనే వున్నాడు. రాజమౌళి సినిమాల్లో అదింకా ప్రత్యేకం. రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఆ క్రేజే వేరు. రాజమౌళితో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా ఎన్టీఆర్ సెపరేట్ ట్రాక్ రికార్డ్ కలిగి వున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number one), సింహాద్రి (Simhadri), యమదొంగ (Yamadonga) తదితర సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చినవే.

అదే అసలు సిసలు ట్విస్ట్

ట్విస్టేంటంటే అల్లూరి, కొమరం వీరిద్దరి గురించి మనకి తెలిసిన కథ కాదు రాజమౌళి చెబుతున్నది. పైగా ఫిక్షన్‌తో కూడిన కథ అని రాజమౌళి చెప్పాడు. అంటే ఆయా పాత్రలు ఆయా వ్యక్తుల్ని గుర్తు చేస్తాయి తప్ప.. ఇది పూర్తిగా చరిత్ర కోణంలో చూడాల్సింది కాదు.

రాజమౌళి మార్క్‌ ట్రీట్‌మెంట్‌ ఈ సినిమాకి కొండంత బలం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ – ఇది తెలుగు సినిమా. ఇది భారతీయ సినిమా. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుండి వస్తోన్న ఈ వెండితెర అద్భుతం తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.

ఒక్కో భాషకి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (RRR)అక్షరాల అర్ధం మారిపోతుంది. ఆ అర్ధాన్ని నిర్వచించేది అభిమానులే. నిర్మాత డి.వి.వి.దానయ్య (DVV Danayya) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan). కోలీవుడ్‌ నటుడు సముద్రఖని (Samudrakhani) వంటి మేటి తారలు, అలియాభట్‌ (Alia Bhat), డైసీ ఎడ్గార్ జోన్స్ (Daisy Edgar Jones) లాంటి అందాల భామలు ఈ సినిమాకి మరింత గ్లామర్‌ తెచ్చారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group