Ruhani Sharma.. ‘చిలసౌ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. తొలి సినిమాతోనే మంచి నటిగా మార్కులేయించుకుంది. టాలీవుడ్‌కి మంచి హీరోయిన్ దొరికిందనుకున్నారంతా.
అంతలా ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ.
కానీ, హీరోయిన్ అనిపించుకోవడమే తన లక్ష్యం కాదంటోంది రుహానీ శర్మ. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తేనే తనలోని అసలు సిసలు నటి బయటికి వస్తుందని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.
అలాగే ఎక్కువగా లవ్ స్టోరీలను ఇష్టపడుతుందట. సైకో తరహా పాత్రలు చేయాలనుందని బోల్డ్‌గా చెప్పేసింది అందాల రుహానీ శర్మ.
Ruhani Sharma ట్రెండీ అయినా ట్రెడిషనల్ అయినా..
అలాగే సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కనిపించిందింతవరకూ. ఇకపై కూడా అలాగే కనిపిస్తానని చెబుతోంది.
అంతేకాదు, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తారతమ్యాలు తనకు లేవంటోంది. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తానంటోంది.

సినిమాలతో పాటూ కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ రుహానీ శర్మ నటించింది.
ట్రెడిషనల్ లుక్స్‌కే కాదు, ఎనీ ట్రెండీ లుక్స్.. ఇట్టే సెట్టయిపోతుంది అందాల భామ రుహానీ శర్మ. సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారును కిర్రెక్కించేస్తుంటుంది.
Also Read: అనసోయగం.! ఎలా.. ఇంతందంగా ఎలా.?
తెలుగులో ‘డర్టీ హరి’, ‘నూటొక్కజిల్లాల అందగాడు’, ‘హిట్’ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ, హిందీ మలయాళ భాషల్లోనూ కొన్నిసినిమాల్లో రుహానీశర్మ నటించింది.

ఏ సినిమాకదే ప్రత్యేకం.. అన్నట్టుగా, ప్రతి సినిమానీ ఆ సినిమాలో కథ, కథనాలు, తన పాత్రకున్న ప్రాధాన్యత దృష్ట్యా మాత్రమే ఓకే చేస్తుందట ఈ బ్యూటీ.