Rukshar Dhillon Dilruba.. నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా గుర్తుందిగా.! ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేయగా అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్‌గా నటించింది.
క్యూట్ క్యూట్ ఫీచర్స్‌తో చూడగానే భలే వుందే.. అనిపించేలా మరో అందాల భామనీ ఈ సినిమాలో చూశాం నానికి జోడీగా. ఆ ముద్దుగుమ్మ పేరే రుక్సార్ థిల్లాన్.
తొలి సినిమాతోనే బాగా ఆకట్టుకుందీ లండన్ బ్యూటీ. ఆ తర్వాత ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ తదితర సినిమాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Rukshar Dhillon Dilruba.. హీటు పెంచేస్తున్న ‘దిల్‌రూబా’
అందుకు కారణం రుక్సార్ నటించిన ‘దిల్ రూబా’ సినిమానే. ఈ సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాని తన అంద చందాలతో హీటెక్కించేస్తోంది రుక్సార్ థిల్లాన్.
కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నెట్టింట ఫోటో షూట్లతో కిర్రాక్ తెప్పిస్తోంది రుక్సార్ థిల్లాన్. తాజాగా వైట్ అండ్ రెడ్ కలర్ ఫ్లోరల్ డ్రెస్‌లో దిల్‌రూబా రుక్సార్ పోజులు కుర్రకారును కట్టి పడేస్తున్నాయ్.

వైట్ కలర్ ఫ్రాక్‌కి అక్కడక్కడా రెడ్ కలర్‌తో డిజైన్ చేసిన లవ్ సింబల్స్ మరింత అందాన్నిస్తున్నాయ్. ఈ క్యూట్ ఫ్రాక్‌లో లైట్‌గా క్లీవేజ్ షో చేస్తున్నా.. రుక్సార్ క్యూట్ స్మైల్ ఆ అందాల్ని డామినేట్ చేస్తోందనిపిస్తోంది.
ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క.!
ఏదో ఒకటీ అరా సినిమాలతో ఇంతవరకూ నెట్టుకొచ్చేసిన రుక్సార్‌కి ఈ ట్రెండ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాలో ఛాన్స్ దొరకడం నిజంగా అదృష్టమే అని చెప్పొచ్చు.
Also Read: రాధికా ఆప్టే.! ఆమె ఏం చేసినా సంచలనమే.!
దాదాపుగా రుక్సార్ కెరీర్ ఖతమైపోయిందనుకున్న టైమ్‌లో వచ్చిన బంపర్ ఛాన్స్ ఇది. అసలే కిరణ్ అబ్బవరంకి గుడ్ టైమ్ కలిసొచ్చేస్తోంది.
హిట్టూ.. ఫట్టూ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మొన్నీ మధ్యనే ‘క’ అంటూ ఓ హిట్టులాంటి హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు.
అన్నీ కలిసొచ్చి,. ‘దిల్ రూబా’ కూడా హిట్టయ్యిందంటే రుక్సార్ బండి గాడిన పడ్డట్లే. అమ్మడికి అవకాశాలు మళ్లీ క్యూ కట్టేయొచ్చు.