Table of Contents
సక్సెస్ లెక్కలేసుకుని సినిమా చేయాలన్న ఆలోచన ప్రభాస్ ఎందుకు చేయడు.? ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందాకైనా వెళ్ళాలనుకోవడం ఈ రోజుల్లో సబబేనా.? రాజమౌళి చేసిన మ్యాజిక్, సుజీత్ చేయగలడని ప్రభాస్ (Saaho Review And Rating) ఎందుకు నమ్మాడు.?
అభిమానుల్ని కొన్నాళ్ళు వెయిట్ చేయించినా, ఏళ్ళ తరబడి వాళ్ళు గుర్తుపెట్టుకునే సినిమా చేయాలన్న ప్రభాస్ ఆలోచన సరైనదేనా.? ఎన్నెన్నో ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరూ ఒక్కోలా సమాధానాలు చెబుతుంటారు. ప్రభాస్ మైండ్‌లో మాత్రం పెర్‌ఫెక్ట్ పిక్చర్ వుంటుంది అన్ని ప్రశ్నలకీ.
అందుకే, ‘బాహుబలి’ సినిమా చేయగలిగాడు.. ‘సాహో’ సినిమా చేయగలిగాడు. కమర్షియల్ సినిమాలు ప్రభాస్‌కి కొత్త కాదు. రికార్డుల మీద ప్రభాస్‌కి పెద్దగా పట్టింపు వుండదు. ఓ మంచి సినిమా చేస్తే, ఆటోమేటిక్‌గా వసూళ్ళు వస్తాయన్నది ప్రభాస్ నమ్మకం. ఆ నమ్మకమే అతనితో ‘బాహుబలి’ చేయించింది.. ‘సాహో’ కూడా చేయించింది.
Click Here: బాక్సాఫీస్‌పై ‘సాహో’ దండయాత్ర షురూ.!
తొలి సినిమా ‘ఈశ్వర్’ నుంచి తాజా సినిమా ‘సాహో’ వరకు ప్రభాస్ చాలా మారాడు.. ఇమేజ్ పరంగా మాత్రమే. అప్పటికీ ఇప్పటికీ ప్రభాస్ అందరికీ డార్లింగే. ‘నన్ను నమ్మి సినిమా ఇవ్వడం ప్రభాస్ గొప్పతనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా కర్తవ్యం’ అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుజీత్ (Saaho Review And Rating).
ఒకే ఒక్క సినిమా చేసిన దర్శకుడు సుజీత్‌ని నమ్మి, 300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రభాస్ చేశాడంటే చిన్న విషయం కాదు. ‘బాహుబలి’ సినిమా చేశాక ఎవరైనా, అంతకు మించి.. అనుకుంటారు. ఇండియాలో రాజమౌళి కంటే పెద్ద డైరెక్టర్ ఎవరున్నారు.? అని వెతుకుతారు. కానీ, ప్రభాస్ అలా చేయలేదు. చేస్తే, అతను ప్రభాస్ ఎందుకవుతాడు.?
మాట ఇచ్చి, తప్పే హీరోల్ని చాలామందిని చూశాం. కానీ, మాట మీద నిలబడే ప్రభాస్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. అభిమానులే కాదు, అతనితో సినిమాలు చేసిన దర్శకులూ అంతే. ప్రభాస్‌ని అందుకే అందరూ ‘డార్లింగ్’ అని పిలుస్తుంటారు.
‘సాహో’ (Saaho) సినిమా కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టారు.? అన్నదానికంటే, ఎంత కష్టపడ్డారు.? అన్న ప్రశ్నకే విలువ ఎక్కువ. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని రప్పించడం గొప్ప కాదు, వారితో సాంకేతిక అద్భుతం సృష్టించడమే గొప్ప.
Click Here: ‘సాహో’రే.. ప్రభాస్ స్టామినా ఎంత.?
‘అంత పెద్ద టెక్నీషియన్స్‌ని.. ఓ కుర్రాడు.. ఒకే ఒక్క సినిమా అనుభవం వున్న దర్శకుడు ఎలా మెప్పించాడో నాకే అర్థం కాలేదు’ అని ప్రభాస్ పలుమార్లు ఆశ్చర్యపోయాడు.
‘బాలీవుడ్ మార్కెట్ కోసమా, ఎక్కువమంది బాలీవుడ్ నటుల్ని తీసుకున్నారు.?’ అని ప్రభాస్‌ని ప్రశ్నిస్తే, ‘నేను తెలుగు.. డైరెక్టర్ తెలుగు.. ఇది తెలుగు సినిమా.. ఇది ఇండియన్ సినిమా..’ అని తనదైన స్టయిల్లో సమాధానమివ్వడం ప్రభాస్‌కి కాక ఇంకెవరికి చెల్లుతుంది.? ఖచ్చితంగా ‘సాహో’ రికార్డులు కొల్లగొడుతుంది.. అదీ టాక్‌కి అతీతంగా.
టాక్ అదిరిపోతే మాత్రం, ఆ రికార్డులు రాయడానికి రోజులు, వారాలు నెలలు కూడా సరిపోవేమో. తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు.. ఆ మాటకొస్తే, దేశమంతా ‘సాహో’ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఓవర్సీస్‌లో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకీ లేని క్రేజ్ కన్పిస్తోంది.
Click Here: ‘సైరా’ వెర్సస్ ‘సాహో’ ఎవరి దమ్మెంత.?
కొద్ది గంటల్లోనే ఓ వెండితెర అద్భుతాన్ని చూడబోతున్నాం. ప్రీ రిలీజ్ రిపోర్స్ అయితే అదిరిపోయాయ్. సినిమాని ఆల్రెఈ చూసేసిన కొందరు సినీ ప్రముఖులు, బహిరంగంగా సినిమా గురించి మాట్లాడటంలేదుగానీ.. దీన్నొక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. ఆ అద్భుతం మరికొద్ది గంటల్లో మనమూ వీక్షించేయబోతున్నాం.
ఇది మన ఇండియన్ సినిమా.. ఇది మన తెలుగు సినిమా.. అని సగర్వంగా ఇంకోసారి తలెత్తుకునేలా చేయడానికి వస్తోన్న ‘సాహో’ (Saaho Review And Rating) కోసం.. మరికొద్ది గంటలు ఇదే స్వీట్ పెయిన్‌ని భరించేద్దామా.!