Table of Contents
తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేసిన సినిమా చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Saaho Prabhas Stamina). తెలుగు సినిమాకి ఇలాంటి ఓ అద్భుతమైన రోజు ఒకటి వస్తుందని ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలయ్యేదాకా ఎవరూ ఊహించలేదనడం అతిశయోక్తి కాదేమో.
లేకపోతే, తెలుగు సినిమా.. బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాగా విడుదలయి, అక్కడ వసూళ్ళను కొల్లగొట్టడమేంటి. ‘ది బిగినింగ్’ ఓ లెక్క, ‘బాహుబలి ది కంక్లూజన్’ ఇంకో లెక్క. ‘ది కంక్లూజన్’ సినిమా దెబ్బకి, బాలీవుడ్ గత రికార్డులు చెరిగిపోయాయ్.
Click Here: బిగ్ షాక్: ప్రభాస్ వర్రీస్.. కారణం అదేనా?
తెలుగు సినిమా లేదు, తమిళ సినిమా లేదు, హిందీ సినిమా లేదు.. వున్నది ఒక్కటే సినిమా.. అదే ఇండియన్ సినిమా.. అని దేశమంతా కోడై కూసిందంటే, అది ‘బాహుబలి’ మన తెలుగు నేలకు తెచ్చిన అరుదైన గౌరవం. ఈ ‘బాహుబలి’ కోసం ప్రభాస్ తన కెరీర్‌ని పణంగా పెట్టాడు.
నిజమే మరి, ‘మిర్చి’ (Mirchi)తో సూపర్ కమర్షియల్ హిట్ కొట్టి, ఎడా పెడా ఓ నాలుగు సినిమాలు అలాంటివే చేసెయ్యకుండా, రాజమౌళి (SS Rajamouli) అడగ్గానే.. బల్క్ డేట్లు ఇచ్చేశాడు. డేట్లు ఇచ్చేయడమే కాదు, తన శరీరంపై ప్రయోగాలు చేశాడు.. కండలు పెంచాడు.. చాలా చాలా కష్టపడ్డాడు.
కష్టం తెచ్చిన ఘన విజయం.. Saaho Prabhas Stamina
ఒకటి కాదు రెండు కాదు.. ఐదు కాదు పది కాదు.. ఏకంగా పాతిక సినిమాలు.. ఆ మాటకొస్తే ఎన్ని సినిమాలు చేసినా రాని ఘనత ఒక్క ‘బాహుబలి’తో ప్రభాస్ సంపాదించేసుకున్నాడు. అవును, ప్రభాస్ ఆలోచనకి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
అంత పెద్ద సినిమా చేశాక, ఎవరి ఆలోచనలు అయినా ఎలా వుంటాయ్.? నేల మీద అయితే వుండవు. కానీ, ప్రభాస్ అందరికీ డార్లింగ్ (Darling Prabhas) కదా. అందుకే, ‘రన్ రాజా రన్’ (Run Raja Run) సినిమా టైమ్‌లో దర్శకుడు సుజీత్‌కి (Sujeeth) ఇచ్చిన మాటకి కట్టుబడి వుండిపోయాడు. అలా ‘బాహుబలి’ తర్వాత సెట్స్ మీదకు వచ్చింది ‘సాహో’.
Click Here: ‘సైరా’ వెర్సస్ ‘సాహో’ ఎవరి దమ్మెంత.?
తొలి సినిమా బడ్జెట్ పది కోట్లు కూడా కాదేమో.! కానీ, రెండో సినిమాని మాత్రం దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేశాడు సుజీత్. ఆషామాషీ విషయం కాదు. ప్రభాస్‌కి ‘బాహుబలి’తో పెరిగిన స్టార్‌డమ్‌ని సుజీత్ మ్యాచ్ చేయగలడా.? లేదా.? అన్న అనుమానాలే రాకుండా, సినిమాని రూపొందించాడు.
‘సాహో’ (Saaho) ప్రోమోస్ చూస్తే ఈ సినిమా కోసం సుజీత్ పడ్డ కష్టం సంగతేంటో అర్థమవుతుంది. ప్రమోషన్స్ మొదలయ్యాయి.. నిజానికి, ప్రమోషన్స్‌కి అతీతంగా ‘సాహో’ సినిమాపై ఎవరూ ఊహించనంత బజ్ ఏర్పడింది.
నెగెటివిటీ.. అదొక లెక్కా.?
నెగెటివిటీ ఈ మధ్య సర్వసాధారణమైపోయింది గనుక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. అయినాగానీ, ‘సాహో’ ఎదుర్కొన్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. కొందరైతే విషం చిమ్మేశారు ‘డార్లింగ్’ మీద. కానీ, అవన్నీ బలాదూర్ అనుకుంది ‘సాహో’ టీమ్.
‘సాహో’ సర్వాంగ సుందరంగా ముస్తాబై విడుదలకు రెడీ అయిపోయింది.. ప్రేక్షకుల్ని అలరించడానికి ఎప్పుడెప్పుడా అని ‘సాహో’ ఉవ్విళ్ళూరుతుంది. ప్రేక్షకుల సంగతి సరే సరి. తెలుగు సినిమా స్టామినా ఏంటో ఆల్రెడీ ప్రభాస్ అందరికీ చూపించేశాడు.
Click Here: ‘సాహో’రే ప్రభాస్.. నెవ్వర్ బిఫోర్.!
ఇంకోసారి ‘బాహుబలి’ లాంటి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే, బాలీవుడ్‌లోనూ కొంత ‘సహాయ నిరాకరణ’ కన్పిస్తున్నట్లుంది ‘సాహో’ (Saaho Prabhas Stamina) విషయంలో. అయినాగానీ, డార్లింగ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు.
ఏడ్చేవాళ్ళెప్పుడూ వుంటారు.. అలాంటివారికి సమాధానం చెప్పడానికి సినిమా రిలీజయ్యాక సాధించే విజయాలు సరిపోతాయ్. సో, ప్రభాస్ కావొచ్చు.. సాహో టీమ్ కావొచ్చు.. ఆందోళన చెందాల్సిన పనిలేదు.
అందులో కొంచెం ‘శ్రద్ధ’ పెడితే బావుంటుందేమో..
మరోపక్క తొలిసారి తెలుగులో సినిమా చేస్తోన్న శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో కనిపిస్తోంది. ముందు ముందు తెలుగు సినిమాల్లో నటిస్తూనే వుంటానని చెబుతోంది.
అయితే, బాలీవుడ్‌లో తన సినిమాల్ని ప్రమోట్ చేసినంత ఉత్సాహంగా తెలుగులో సినిమాని (Saaho) ప్రమోట్ చేయడంలేదన్న విమర్శలు ఆమె మీద గట్టిగానే విన్పిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
Click Here: అద్భుతః సాహోరే.. హాలీవుడ్ కా బాప్.!
ఏదిఏమైనా, తొలి రోజు.. తొలి వీకెండ్.. తొలి వారం.. ఇలా వసూళ్ళ దుమ్ము రేపెయ్యాలనీ, గత రికార్డుల్ని ‘సాహో’ (Saaho Prabhas Stamina) తిరగరాసెయ్యాలనీ ఆశిస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) అభిమానులు.
సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాపై (Saaho Prabhas Stamina) ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవ్.. ఆ అద్భుతాల్ని చూడాలన్న ఆశ తప్ప.