పేరు సచిన్ టెండూల్కర్.. కానీ, అతని బ్యాట్ నుంచి టన్నులకొద్దీ పరుగులు వచ్చి పడ్డాయి గనుక.. ‘టన్’డూల్కర్ అనడం సబబేమో. క్రికెట్ దేవుడీ మాజీ క్రికెటర్. భారతరత్నం ఈ మాస్టర్ బ్లాస్టర్. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar Cricket God Master Blaster) గురించి ఎప్పుడు చర్చ జరిగినా, అది అభిమానులకి పెద్ద పండగే.
ఆటగాడిగా, అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు గుడ్ బై చెప్పేసినా.. క్రికెట్ గురించి ఎక్కడ, ఎప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చినా, సచిన్ టెండూలర్కర్ (Happy Birthday Sachin Tendulkar) పేరు ప్రస్తావించకుండా అది సాధ్యం కాదు. ఫలానా క్రికెట్, సచిన్ టెండూల్కర్ తరహాలో ఆడుతున్నాడంటూ క్రికెట్ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు మాట్లాడాల్సిందే. దటీజ్ సచిన్ టెండూల్కర్.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ సచిన్ టెండూల్కర్ (Master Blaster Sachin Tendulkar) రాణించాడని కొత్తగా చెప్పుకోవాలా.? క్రికెట్ అంటే, సచిన్ టెండూల్కర్ కన్నా ముందు.. ఆ తర్వాత.. అని మాట్లాడుకోవాలి. అంతలా క్రికెట్ ఆటలో ‘బెంచ్ మార్క్’ సెట్ చేశాడు ఈ క్రికెట్ దేవుడు.
664 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు, 34357 అంతర్జాతీయ పరుగులు, 100 అంతర్జాతీయ సెంచరీలు, 201 అంతర్జాతీయ వికెట్లు.. ఏ క్రికెటర్ అయినా, ఈ గణాంకాల్ని అధిగమించగలడా.? ఆయా విభాగాల్లో విడివిడిగా సచిన్ (Cricket God Sachin Tendulkar) రికార్డుల్ని అందుకోగలరేమోగానీ.. మొత్తంగా అన్ని విభాగాల్లోనూ సచిన్ నెలకొల్పిన రికార్డుల్ని ఏ క్రికెటర్ సమీప భవిష్యత్తులో అధిగమించే ఛాన్సే లేదు.
సచిన్ టెండూల్కర్.. ప్రపంచ క్రికెట్ విషయానికొస్తే సింగిల్ పీస్. అందుకే అతను మాస్టర్ బ్లాస్టర్ అయ్యాడు. క్రికెటర్ మాత్రమే కాదు, అంతకు మించి ఆయన మానవతావాది. కొత్త తరం క్రికెటర్లకు గురువు. క్రికెట్ అభిమానులకి దేవుడు.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar Cricket God Master Blaster) అనే మహోన్నతమైన వ్యక్తికి సాటెవ్వడు.?