బంతి ఎక్కడ పడితే ఏమవుతుందో తెలియని అయోమయానికి బౌలర్ గురైతే.? ఇక ఇలాంటి పరిస్థితిని బ్యాట్స్‌మెన్ (India Vs England Ahmedabad Test) అస్సలేమాత్రం జీర్ణించుకోలేడు. సరే, చరిత్రలో అతి తక్కువ స్కోర్లు నమోదైన సందర్భాలు టెస్టు క్రికెట్‌లో చాలానే వుండొచ్చు.
కానీ, ఇంత దారుణంగానా.? అసలు అక్కడ పిచ్ అనేదే ఎవరికీ కన్పించలేదు. ఏదో గల్లీలో కన్పించే మామూలు నేలలా వుందక్కడ పరిస్థితి. భారీ వర్షాలకు రోడ్లు పాడైపోయి, గుంతలు ఏర్పడితే ఎలా వుంటుందో.. అలా తయారైంది పిచ్.
బహుశా క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి చెత్త పిచ్ ఇంకొకటి వుండదేమో. కానీ, ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యాధునిక సౌకర్యాలతో సరికొత్తగా ఏర్పాటైన క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగిందంటే నమ్మగలమా.? టీమిండియా గెలిచింది. హమ్మయ్యా.! అని భారత క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
‘చెత్త పిచ్’ అని బహుశా ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు అనుకుని వుండొచ్చెుగాక. కానీ, అదే అభిప్రాయం భారత క్రికెట్ అభిమానుల్లోనూ (India Vs England Ahmedabad Test) కనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్ అంటే పరుగులు రావాలి.. వికెట్లు పడాలి.. ఫలితం తేలాలి.. అప్పుడే అసలు సిసలు మజా.
బ్యాట్స్‌మెన్‌పై బౌలర్ పైచేయి సాధించాలి.. బౌలర్, బ్యాట్స్‌మెన్‌ని నిలువరించగలగాలి. అలాంటి మజా లేకుండా, మ్యాచ్ మొత్తం వన్ సైడెడ్‌గా జరిగితే ఏం ప్రయోజనం.? ఫలితమొచ్చిందిగానీ.. ఇలాంటి మ్యాచ్‌లు వరుసగా జరిగితే, క్రికెట్ మీద ఆసక్తి చచ్చిపోతుందన్నది మెజార్టీ క్రికెట్ అభిమానుల ఆవేదన.
రెండు రోజుల్లో మ్యాచ్ ముగిసిపోయింది. టెస్ట్ క్రికెట్‌కి సంబంధించి ఓ ఏడెనిమిది దశాబ్దాల లెక్క తీస్తే.. ఇంత తక్కువ సమయంలో పూర్తయిపోయిన మ్యాచ్ ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదేమో.
స్టేడియంని అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించి వుండొచ్చు.. కానీ, అందులో మైదానాన్ని (India Vs England Ahmedabad Test) మాత్రం అత్యంత చెత్తగా రూపొందించారన్నమాట. చెత్తగా రూపొందించడం కాదు.. అసలు పిచ్ తయారు చేయడమే మర్చిపోయి వుండాలి. అంతేనా.?