Sahithi Dasari Bikini.. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అవడం కొత్తేమీ కాదు.!
ఈ క్రమంలో కొందరు తుంటరి నెటిజనం, అందాల భామల్ని చిలిపి ప్రశ్నలతో వేధిస్తుంటారు. చాలా ఓపిగ్గా ఆ తుంటరి ప్రశ్నలకి సమాధానమిస్తుంటారు హీరోయిన్లు.
ఓ నెటిజన్, ‘బికినీ ఫొటో షేర్ చేస్తావా.?’ అనడిగితే, ఎమోజీలు షేర్ చేయడం.. చాలామందికి గుర్తుండే వుంటుంది.
ఇప్పుడైతే, ‘ఎక్స్’ (ఒకప్పటి ట్విట్టర్) తదితర సోషల్ మీడియా వేదికలపై, నేరుగా ‘ఏఐ’ అసిస్టెంట్‌ని అడిగేస్తున్నారు, హీరోయిన్లను బికినీల్లో చూపించమని.
Sahithi Dasari Bikini.. అడిగితే కాదంటానా.?
అడిగిందే తడువు… సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ల బికినీ ఫొటోలు దర్శనమిచ్చేస్తున్నాయ్.. వీటిని మార్ఫింగ్ అనాలా.? క్రియేటివిటీ అనాలా.?
‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్‌ని కూడా బికినీలో చూపించేసింది ‘గ్రోక్’.! ఎలాన్ మస్క్, తన బికినీ ఫొటో చూసుకుని, ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత లైట్ తీసుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి.
తెలుగు సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపించే సాహితి దాసరి అనే నటి, సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తే, బికినీలో ఆమెని చూపించమని ఓ నెటిజన్ అడిగాడు.

‘ఏం పోయేకాలం రా ఇది’ అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజన్‌కి ఓ సెటైరేసింది సాహితి దాసరి. స్పోర్టివ్‌గా తీసుకుందామె.!
మరోపక్క, ‘స్పిరిట్’ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రివీల్ చేయగానే, ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి.
పలువురు హీరోల ఫొటోల్ని బికినీల్లోకి గ్రోక్ సహా వివిధ ఏఐ అసిస్టెంట్స్ సాయంతో మార్చేసి, పైశాచికానందం పొందుతున్నారు చిల్లర బ్యాచ్.!
Also Read: చక్కనమ్మ చెవులకెందుకింత ‘బరువు’ బాధ్యతలు.?
కాదేదీ కవితకనర్హం.. అంటాడో కవి.! కానీ, ఇక్కడ కాదేదీ పైశాచికానందానికి అనర్హం.. అన్నట్లు తయారైంది పరిస్థితి.!
తమ ఫొటోల్ని, వీడియోల్ని అసభ్యకరంగా వాడుతున్నారంటూ పలువురు సినీ ప్రముఖులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ, సోషల్ మీడియాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైత్యం మొదలయ్యాక.. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. దీన్ని నియంత్రించడం దాదాపు అసాధ్యం.!
