Sahithi Dasari Political Reel.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్.. వీళ్ళిప్పుడు సినిమా స్టార్ల కంటే ఎక్కువనడం అతిశయోక్తి కాదేమో.!
సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమా కోసం ప్రముఖ దర్శకుడు ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా, ‘కుర్చీని మడతబెట్టి’ అనక తప్పలేదు.!
ఓ బిచ్చగాడి నోటివెంట వచ్చిన ఈ ‘కుర్చీని మడతబెట్టి మెడ మీద..’ అనే బూతు మాటని ఓ యూ ట్యూబ్ ఛానల్ వైరల్ చేస్తే, దాన్ని తన సినిమాలో పాటగా పెట్టేశాడు త్రివిక్రమ్.
రాజకీయాల్లో ఇన్‌ఫ్లూయెన్సర్స్..
సినిమాల్లో నటీనటులు నటిస్తారు. ఇన్‌ఫ్లూయెన్సర్స్ కూడా అంతే.! రాజకీయ పరమైన ప్రచార వీడియోలతో సందడి చేస్తున్నారు.
కొందరు నేరుగానే చేస్తోంటే, ఇంకొందరు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా రాజకీయ పార్టీల కోసం ప్రచార కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న వైనం కనిపిస్తూనే వుంది.
తాజాగా, ఈ లిస్టులోకి సినీ నటి సాహితి దాసరి కూడా చేరిపోయింది. చిన్నా చితకా సినిమాల్లో నటించిన సాహితి, సోషల్ మీడియా వేదికగా బాగానే యాక్టివ్‌గా వుంటోంది.

సాహితి దాసరి చేసిన తాజా వీడియో ఒకటి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ పాటకి ఆమె చేసిన డాన్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో సగమే కనిపిస్తున్న వైఎస్ జగన్ ‘సిద్ధం’ పోస్టర్.. ఈ హంగామాకి కారణం.
‘అటెన్షన్ కోసం కక్కుర్తి పడుతోంది’ అని కొందరు, ‘అమ్ముడుపోయింది’ అని ఇంకొందరు.. సోషల్ మీడియాలో సాహితి దాసరిని ఆడేసుకుంటున్నారు.
Sahithi Dasari Political Reel.. అటెన్షన్ అవసర్లేదు..
‘నాకేమీ అటెన్షన్ అవసరం లేదు.. రాజకీయాల పట్ల అస్సలు ఆసక్తి లేదు..’ అంటూ తనపై వస్తున్న ట్రోల్స్ విషయమై స్పందించింది సాహితి దాసరి.
Also Read: Radhika Apte: నిందలేస్తే సింపతీ వస్తుందా రాధికా.!?
ఇటీవలి కాలంలో ప్రతి చిన్న విషయాన్ని డీప్‌గా అబ్జర్వ్ చేయడం, ట్రోల్ కంటెంట్‌ని వైరల్ చేయడం సర్వసాధారణమైపోయింది.
మరి, ఆ మాత్రం తెలియకుండానే సాహితి దాసరి సదరు రీల్ చేసి వుంటుందా.? అయినా, చేసినా తప్పేముంది.? కాదేదీ రాజకీయానికి అనర్హం.!