Sai Dharam Tej Manager.. ఆయనో టాలీవుడ్ హీరో.! ఈ మధ్యనే చాలా పెద్ద హిట్టు కొట్టాడు.! అంతే కాదు, మేనేజర్‌ని కూడా కొట్టాడట.! ఎందుకు.?
ఓ సినిమా షూటింగ్ సమయంలో, హీరోగారి కారవాన్ నుంచి భారీ శబ్దాలు వినిపించాయట. అందులోంచి, మేనేజర్ ఒకింత అసహనంతో బయటకు వచ్చాడట.!
కొట్టి మరీ మేనేజర్‌ని ఆ హీరో, కారవాన్ నుంచి గెంటేశాడట. కారవాన్ నుంచి మాత్రమే కాదు, ‘మేనేజర్’ బాధ్యతల నుంచి కూడా అతన్ని తప్పించాడట ఆ హీరో.
Sai Dharam Tej Manager ఇంతకీ అసలేం జరిగింది.?
అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు.. తండ్రీ కొడుకుల మధ్య కూడా అభిప్రాయ బేధాలు రావొచ్చు. హీరో – మేనేజర్ మధ్య అభిప్రాయ బేధాలు వస్తే వింతేముంది.?
ఇంతకీ, అసలేం జరిగిందన్నది ఆ ఇద్దరికే తెలుసు.! కానీ, చిలువలు పలవులు చేసి.. విషయానికి అవసరం లేని మసాలాలు అద్ది.. ఘాటైన వంటకాలు తయారు చేసి పారేశారు.

మేనేజర్ చాలా మంచోడు.. హీరో మాత్రం చాలా వరస్టు.! మేనేజర్ మంచోడు కాబట్టే, ఆఫర్లు పోటెత్తుతున్నాయ్. హీరోగారు దుర్మార్గుడు.. అంటూ కథనాల్ని వండి వడ్డిస్తూనే వున్నారు.
మేనేజర్ పెదవి విప్పలేదేం.?
ఈ కథలో ఆ హీరో సాయి ధరమ్ తేజ్. ఆ మేనేజర్ పేరు సతీష్.! ‘విరూపాక్ష’ విజయం తర్వాత సాయి ధరమ్ తేజ్‌కి పొగరెక్కువయ్యిందన్నది సోకాల్డ్ వెకిలి మీడియా ఉవాచ.
ఇంతవరకు ఆ మేనేజర్ సతీష్ ఎక్కడా పెదవి విప్పలేదు. మెగా కాంపౌండ్‌తో విడదీయరాని అనుబంధం వుందతనికి. పైగా, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.
Also Read: అనసూయ ముద్దు.! దాటేసిందా హద్దు.?
అక్కడికేదో, ఆ మేనేజర్ వల్లనే సాయి ధరమ్ తేజ్ హీరో అయ్యాడనేంతలా వెకిలి మీడియా చెత్త రాతలు రాస్తోంటే, సినీ పరిశ్రమలో అంతా నవ్వుకుంటున్నారు.
సినీ జర్నలిజం అంటే.. ఇంత హాస్యాస్పదమా.? అలా తయారు చేశారు కొందరు పాత్రికేయ వ్యభిచారులు.!
తప్పంతా సోకాల్డ్ జర్నలిస్టులదేనా.? ఈ పాత్రికేయ వ్యభిచారం చేయిస్తున్న సోకాల్డ్ మీడియా సంస్థల సంగతేంటి.
సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి కుట్రలు మీడియా చేయడం చూస్తుంటాం. సినిమా రంగంలోనూ మీడియా కుట్రలు పతాక స్థాయికి చేరిపోయాయ్.!