వాన పాటలంటే ఇష్టపడని వారుండరు. ఆ వానలో నెమలి నాట్యమాడితే.. ఆ అద్భుతాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవుగా. ఇక్కడ నెమలి నాట్యమంటే, సాయి పల్లవి డాన్స్ (Sai Pallavi Naga Chaitanya Love Story Evo Evo Kalale).
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి ’లవ్ స్టోరీ‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుండి లేటెస్టుగా ‘ఏవో ఏవో కలలే’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాయి పల్లవి డాన్సులకు ఆడియన్స్ మరోసారి ఫిదా అవుతున్నారు.
అసలే వానపాట.. ఆ పై సాయి పల్లవి (Sai Pallavi) అందమైన డాన్సులు.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో (Love Story Telugu Film) హీరో నాగ చైతన్య. చైతూ (Akkineni Naga Chaitanya) డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
పక్కన ఉన్నది సాయి పల్లవి కదా. తనని హండ్రడ్ పర్సంట్ మ్యాచ్ చేసేందుకు బాగానే కష్టపడినట్టున్నాడు. సాయి పల్లవితో పోటీ పడి డాన్సలేసే ప్రయత్నం చేశాడు. చైతూ కష్టం వేస్ట్ కాలేదు. చిన్న డాన్స్ బిట్.. చైతూ డాన్సింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకునేలా చేసింది.
అన్నట్టు, చైతూ సతీమణి అక్కినేని సమంతకు (Samantha Akkineni) ఈ సాంగ్ చాలా ఫేవరేట్ అట. ఎప్పటినుండో ఈ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోందట. బహుశా చైతూ ఇంత బాగా డాన్స్ చేశాడని కాబోలు.
ఇదిలా వుంటే, ‘లవ్ స్టోరీ’ (Love Story Telugu Movie) సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వీటిల్లో ‘సారంగ దరియా’ పాట గురించి చాలా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలేమో. ఆ పాట యూ ట్యూబ్లో సరికొత్త రికార్డుల్ని సృష్టించేస్తోంది వ్యూస్ అండ్ లైక్స్ పరంగా.
యూ ట్యూబ్ రికార్డుల్ని తీసుకుంటే సాయిపల్లవి సాంగ్స్ ‘మారి’ సినిమా నుంచి ‘రౌడీబేబీ’, ‘ఫిదా’ నుంచి ‘వచ్చిండే..’ పాటలు టాప్ ప్లేస్లో వున్న విషయం విదితమే. మూడో ప్లేస్ కోసం ‘సారంగ దరియా‘ పరుగులు పెడుతోంది. మరి, ఈ ‘ఏవో ఏవో కలలే’ కూడా అదే బాటలో పయనిస్తుందేమో వేచి చూడాలి.