Salman Khan Snake Bite.. బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరు.? అన్న ప్రశ్నకు లేడీస్ విభాగంలో రేఖ, జెంట్స్ విభాగంలో సల్మాన్ ఖాన్.. నెంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తారు. సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే, అతని మీద ‘కాట్రాజు’ అనే ఆరోపణలున్నాయ్.
‘అమ్మాయిల్ని అందంగా కాటేస్తాడు..’ అనేది ఆ ‘కాట్రాజు’ పేరు వెనుక సారాంశం. కానీ, సల్మాన్ ఖాన్ చాలా మంచోడు. అమ్మాయిలతో స్నేహం చేస్తాడు. కానీ, అమ్మాయిలే అతన్ని వదిలేస్తారు.. అనేది మరో వాదన. ఏది తప్పు.? ఏది ఒప్పు.? అనేది మనం చెప్పలేం.
Salman Khan Snake Bite.. సల్మాన్ ఖాన్.. ఆ హీరోయిన్లను కాటేశాడా.?
కానీ, చాలా మంది జీవితాల్లో సల్మాన్ ఖాన్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సల్మాన్ ఖాన్ పేరు చెప్పుకుని, ఎంతో మంది హీరోయిన్లు సినీ రంగంలో ఎదిగారు. హీరోయిన్లుగా అత్యున్నతమైన స్థాయిని అందుకున్నారు. కానీ, సల్మాన్ ఖాన్‌కి మాత్రం పెళ్లి కాలేదు. ఏమో సల్మాన్ ఖాన్ గత జన్మలో ఏం తప్పు చేశాడో.!

ఇక్కడ విషయం సల్మాన్ ఖాన్‌కీ, ఓ పాముకీ మధ్య నడిచిన సరసం గురించి. స్నేహితులతో ఫామ్ హౌస్‌లో పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడట సల్మాన్ ఖాన్ (Salman Khan). వాళ్లున్న చోటుకి ఓ పాము వచ్చింది. దాన్ని చూసి, అందరూ బెదిరిపోయారు. కానీ, మన కాట్రాజు తెగించాడు. ఆ పాముని పట్టుకున్నాడు. కండబలం అయితే వుంది కానీ, బుద్ధి బలం వాడలేదు. సల్లూ భాయ్‌ని పాము కాటేసింది. చాకచక్యంగా తప్పించుకుంది.
సల్మాన్ ఖాన్‌ని కాటేసేంత ధైర్యమా.?
ఇంకేముంది.. సల్లూ భాయ్‌ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్స చేశారు. కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో వుంచి, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఇంటికి పంపించేశారు. ఇంటికొచ్చాకా సల్మాన్ ఖాన్ తనను కాటేసిన పాముగారితో ఫోటో దిగాడట. అది నా ఫ్రెండే అని అంటున్నాడు. అందుకే మరి, ‘కాట్రాజు’ అనేది.
సల్మాన్ ఖాన్ (Salman Khan) ఏం చేసినా ఇలాగే ఉంటుంది. ఆయన డాన్స్, ఆయన ఫైట్స్, ఆయన కామెడీ.. ఏదైనా భిన్నమే. నిజానికి పాము కాటుకి గురైతే ఎవరైనా బెదిరిపోతారు. అలా బెదిరిపోవడమే ఎక్కువ సందర్భాల్లో చనిపోవడానికి కారణమవుతుంది. పాము కరిస్తే, బెదిరిపోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి.. ముందుగా ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స చేయించుకోవాలి.
Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?
ఇంతకీ, పార్టీ జోన్‌లోకి నాగరాజు (Salman Khan) ఎందుకొచ్చినట్లు.? సల్లూ భాయ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కదా.. కంపెనీ ఇద్దామని వచ్చిందేమో.