సమంత అక్కినేని సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, సినీ రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అలాంటి సమంత, తన ‘డ్రీమ్ రోల్’ (Samantha Akkineni Shakuntalam Dream Role) అంటూ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలోని తన పాత్ర గురించి చాలా చాలా ప్రత్యేకంగా చెబుతోందంటే, ఈసారి ఇంకాస్త గట్టిగానే హిట్టు కొట్టబోతోందనిపించడంలో వింతేముంది.?
కెరీర్లో సమంత కొన్ని గ్లామరస్ పాత్రలు చేసింది.. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలూ చేసింది. హిట్టూ.. ఫట్టూ.. అనేవి వేరే అంశాలు.
నటిగా సమంత ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. అసలు ‘సమంత బాగా నటించలేదు’ అన్న ప్రస్తావనే ఇప్పటిదాకా రాలేదు. ఎందుకో, కరోనా తర్వాత సమంత ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
ఇక, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ విషయానికొస్తే.. ఆయన ఇంకా ఇంకా స్పెషల్. ఏదన్నా ప్రాజెక్ట్ అనుకున్నాడంటే.. దానికోసం ‘పని రాక్షసుడిలా’ కష్టపడతాడు.
‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ సినిమా చేద్దామనుకున్నాడుగానీ, మధ్యలోకి అనుకోకుండా ‘శాకుంతలం’ వచ్చిపడింది. ఏదో చిన్న సినిమా అనుకుంటే కాదు కాదు.. ఇది కూడా చాలా పెద్ద వ్యవహారమేనని గుణశేఖర్ చెబుతున్నాడు.
‘నా కెరీర్లో చాలా సినిమాలు చేశాను. రాకుమారి పాత్రలో కనిపించలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరుతుంది. అంతే కాదు, నటిగా నన్ను ఇంకో మెట్టు పైకెక్కిస్తుంది’ అని చెబుతోంది సమంత.
అక్కనేని సమంత ఇంతలా చెబుతోదంటే, ‘శాకుంతలం’ (Samantha Akkineni Shakuntalam Dream Role) సినిమా మామూలుగా వుండదన్నమాట.. ఓ స్థాయిలో ఈ సినిమాని ఊహించేసుకోవచ్చన్నమాట.