Samantha Marriage Raj Gossips.. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని సమంత అనుకుంటే, అందుకు ఎవరి అనుమతీ అవసరం లేదు.!
కాకపోతే, సెలబ్రిటీ కదా, ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోవడంపై ఒకింత రచ్చ జరగడం మామూలే.
అయినాగానీ, ఆ ‘రచ్చ’కీ ఓ హద్దు వుంటుంది. తీవ్ర అనారోగ్యం పాలై, ఓ దశలో సినిమా కెరీర్ కొనసాగించగలదా.? లేదా.? అన్న డైలమా నుంచి, తిరిగి సినిమాల్లో నటించడమే కాదు, సినిమాలు నిర్మిస్తోంది సమంత.
సమంత మాజీ భర్త నాగచైతన్య కొన్నాళ్ళ క్రితమే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. నటి శోభిత ధూళిపాళను వివాహమాడాడు నాగచైతన్య.
నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్ళి చేసుకోవడం.. వైవాహిక బంధంలో మనస్పర్ధలు, ఆ తర్వాత విడాకులతో ఎవరి దారి వారు చూసుకోవడం తెలిసిన విషయాలే.
Samantha Marriage Raj Gossips.. రెండో పెళ్ళి ఎప్పుడు.?
రెండో పెళ్ళి విషయమై సమంత, ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా, లైట్ తీసుకుంది. ఆమె జీవితం, ఆమె ఇష్టం.
తాజాగా, సమంత బాలీవుడ్ ఫిలిం మేకర్ రాజ్‌తో ప్రేమలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. సమంతని పెళ్ళాడేందుకోసం, రాజ్ తన భార్యకు విడాకులిచ్చేశాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే, సమంత రెండో పెళ్ళి పుకార్లపై, సమంత టీమ్ స్పందించింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టి పారేసింది.
ప్రస్తుతం సమంత, నిర్మాతగా కొత్త ఫేజ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘శుభం’ అనే సినిమాని నిర్మించింది సమంత.
Also Read: Good Bad Ugly Review: డిజాస్టర్ ‘సుడిగాడు’.!
మరోపక్క, సమంత పలు సినిమాలకు కమిట్ అయ్యింది కూడా నటిగా.! ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు త్వరలోనే రానున్నాయి.
కాగా, ఎవరో పనిగట్టుకుని చేయిస్తున్న దుష్ప్రచారమంటూ, సమంత అభిమానులు, ప్రస్తుత పుకార్లపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వేస్తున్నారు.
మరోపక్క, సమంతని ట్రోల్ చేయడం అనేది తీవ్రస్థాయిలోనే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా.