అనన్య నాగళ్ళ: తప్పు చేశా.! కానీ, తిరిగిచ్చేశా.!
Ananya Nagalla
Ananya Nagalla Betting Apps.. సినీ నటి అనన్య నాగళ్ళ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీల లిస్టులో వుంది.
‘తెలియక చేశా.. తప్పు తెలుసుకున్నా..’ అంటూ ఓ వీడియో విడుదల చేసింది అనన్య నాగళ్ళ తాజాగా.
పలువురు సినీ ప్రముఖులు, బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు గతంలో. ఇప్పటికీ కొంతమంది చేస్తూనే వున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఆర్థిక నష్టమే కాదు, ప్రాణాలు కూడా పోతున్నాయ్.

ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు, బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల తాట తీస్తున్నారు కూడా.
దాంతో, తన మీద వచ్చిన ఆరోపణలపై సినీ నటి అనన్య నాగళ్ళ వివరణతో కూడిన వీడియో విడుదల చేసింది. తాను చేసింది తప్పేననీ, తెలియక చేశానని వివరణ ఇచ్చుకుంది.
Ananya Nagalla Betting Apps.. తప్పు చేశానని ఒప్పుకున్నా…
‘అది తప్పని తెలిశాక, బెట్టింగ్‌లో కొందరు డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసి.. కొంతమందికి నేను ఆ డబ్బుల్ని సాయం కూడా చేశా..’ అని చెప్పింది అనన్య నాగళ్ళ.
ఎవరూ బెట్టింగ్ యాప్స్ పట్ల ఆకర్షితులు కాకూడదనీ, సాధారణమైన ఆట.. అనుకున్నానుగానీ, ప్రాణాల్ని తీస్తుందని అనుకోలేదని అనన్య నాగళ్ళ చెప్పుకొచ్చింది.
నిజానికి, బెట్టింగ్ యాప్స్.. ఆర్థికంగా చిదిమేస్తాయనీ, ప్రాణాలు తీసేస్తాయని తెలియనంత అమాయకులైతే కాదు సినీ సెలబ్రిటీస్.
Also Read: ‘అందగాడు’ పోసాని కృష్ణ మురళి అరెస్ట్.!
కాకపోతే, చట్టబద్ధమైనవి.. అంటూ ఆయా బెట్టింగ్ యాప్స్, సెలబ్రిటీల దగ్గరకు వెళ్ళి చెప్పడం, సాధారణ ప్రకటనల్లానే సెలబ్రిటీలు వీటినీ చూడటంతో.. ఇంత దారుణం జరిగిందిపోయింది.
క్షమాపణ చెప్పినాసరే, క్షమార్హం కాని నేరమిది.! బెట్టింగ్ యాప్స్ అత్యంత ప్రమాదకరం.!
డబ్బులైతే తిరిగిచ్చేశానని చెబుతోందిగానీ, పోయిన ఒక్క ప్రాణాన్ని అయినా అనన్య నాగళ్ళ తిరిగి తీసుకురాగలదా.?
ఈజీ మనీ కోసం కొందరు అమాయకులు ఎలాగైతే బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారో.. చిత్రంగా, సెలబ్రిటీలు కూడా అదే ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం అత్యంత హేయం.