Samantha Ruth Prabhu Beast.. సూపర్ స్టార్ మహేష్‌బాబు ఓ సినిమాలో హీరోయిన్ సమంతని ఉద్దేశించి ‘పిట్టమొహం’ అంటాడు.! అదో పన్నీ డైలాగ్.!
సినిమా వేరు.. రియల్ లైఫ్ వేరు.! సమంత రియల్ లైఫ్‌లో ఫైటర్.! వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందామె. సినిమా రంగంలోనూ అంతే.!
‘మయోసైటిస్’ బారిన పడ్డ సమంత, ‘ఇక జీవితం అయిపోయింది’ అనుకోలేదు. నడవలేని పరిస్థితిని కూడా ఎదుర్కొన్నట్లు ఆ మధ్య పోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Samantha Ruth Prabhu Beast సమంత అంటే బీస్ట్.!
కానీ, సమంత అంటే బీస్ట్.. సమంత అంటే ఫైటర్.! సాక్ష్యం కావాలా.? ఇదిగో చూడండి.. అంటూ సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది.
కఠినమైన వర్కవుట్లు చేసేస్తోంది సమంత ఆ వీడియోలో. ‘మయోసైటిస్’ నుంచి కోలుకుంటున్న సమంత, ఈ క్రమంలో మళ్ళీ తన శరీరాన్ని స్ట్రాంగ్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

‘బలం తినే తిండిలో లేదు.. మన ఆలోచనల్లో వుంది. ఆటో ఇమ్యూన్ సమస్య నుంచి బయట పడేందుకు ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతున్నా.. అదే నాకు చాలా చాలా నేర్పింది..’ అంటూ సమంత ఈ వీడియో పోస్ట్ చేసింది.
అప్పుడు ట్రోల్స్.. ఇప్పుడు అభినందనలు..
మొన్నీమధ్యనే సమంత ‘శాకుంతలం’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొంది. అప్పుడామె చేతిలో ఓ జపమాల కనిపించింది.
‘సమంత పేడువుట్ అయిపోయింది.. చాలా నీరసంగా మారిపోయింది. ఇకపై సమంత సినిమాల్లో కనిపించకపోవచ్చేమో..’ అంటూ ట్రోల్ చేశారు చాలామంది.
ఓ వైపు ‘మయోసైటిస్’తో పోరాడుతూ, అంతకన్నా దారుణమైన రోగం ‘ట్రోలింగ్’ని ఎదుర్కొంటూ.. సమంత ధైర్యంగా నిలబడుతున్న తీరుని అభినందించకుండా వుండలేం.
Also Read: Sapthami Gowda.. ‘కాంతా.! రా.!’ రమ్మంటున్నారు.!
తెలుగుతోపాటు తమిళ సినీ పరిశ్రమలోనూ తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న సమంత, హిందీ సినీ పరిశ్రమలోనూ అంతకు మించిన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అనారోగ్యం కారణంగా సమంత ఇకపై సినిమాలు చేయదన్న ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.
సమంత ఫైటర్.. ఆమె ఒక బీస్ట్.! షీ ఈజ్ బ్యాక్.! ఇదిగో, ఇంతకన్నా సాక్ష్యం ఇంకేమన్నా కావాలా.?